Advertisement
Google Ads BL

వినోదం 100% ఆడియో విడుదల!


శ్రీమతి పొట్నూరు సరోజమ్మ ఆశీస్సులతో ఎస్ ఎస్ సెల్యులాయిడ్స్ బ్యానర్ లో పొట్నూరు చక్రధరుడు సమర్పించు చిత్రం 'వినోదం 100%'.  ఈ చిత్ర ఆడియో విడుదలను మనీషా మ్యూజిక్ ద్వారా  ఆదివారం హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో అతిరధుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ వి కృష్ణారెడ్డి, మనీషా ఫిల్మ్స్ అధినేత, నిర్మాత కిషోర్ రాటి,  మరియు అచ్చిరెడ్డి లు బిగ్ సిడి ను విడుదల చేయగా, చిత్ర టీజర్ ను పృథ్వి రాజ్ మరియు సత్యం రాజేష్ లు విడుదల చేసారు. ఈ సందర్భంగా

Advertisement
CJ Advs

ఎస్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ''నేను దర్శకత్వం వహించిన వినోదం చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుల్లో సినిమా లు  కామెడీ ఉంటేనే హిట్ అవుతున్నాయి.  సినిమాలు నిర్మించే ప్రతి ఒక్కరూ కూడా కామెడీ కి ప్రాముఖ్యతను ఇస్తున్నారు. కనుక ఈ చిత్ర దర్శక నిర్మాతలు కూడా వందశాతం కామెడీ పండించాలనే ఉద్దేశ్యంతోనే 'వినోదం 100%' అనే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు విన్నాను చాలా బాగా వచ్చాయి. కనుక ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాదిస్తుందనే నమ్మకం నా కుంది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతిఒక్కరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు. 

చిత్ర దర్శకుడు  జై శ్రీరామ్ మాట్లాడుతూ.. ''ముందుగా  ఈ చిత్ర ఆడియో కు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ఎస్ వి కృష్ణారెడ్డి గారికి, కిశోర్ రాటి గారికి మరియు ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఈ చిత్రం ప్రారంభం నుండి పబ్లిసిటీ వరకు బాగా రావడానికి కారణమైన మా నిర్మాత పొట్నూరు శ్రీనివాసరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నా, ఆయన సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. వినోదం 100% అనే చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాము. ప్రతిఒక్కరికీ ఈ చిత్రం  తప్పకుండా నచ్చుతుందనే భావనతో ఉన్నాను. ఈ చిత్రం లో నటించిన నటీనటులకు మరియు టెక్నీషియన్స్ కు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం'' అన్నారు. 

మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ.. ''పాటలు అందరికీ నచ్చాయని ఆశిస్తున్నాను. మా అందరికీ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను'' అన్నారు. 

పృథ్వి రాజ్ మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం బ్యాంకాక్ లో షూటింగ్ చేసారు. నిర్మాత పొట్నూరు శ్రీనివాసరావు ఎక్కడా కాంప్రోమైస్ కాకుండా నిర్మించారు. ప్రతి ఒక్క కమెడియన్ మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్ తో కథ సాగుతుంది. స్టొరీ కి ఆప్ట్ అయ్యేవిదంగానే 'వినోదం 100%' అనే టైటిల్ ను పెట్టారు. చిన్న సినిమాల వలన ఎంతో మందికి అవకాశాలు, ఆధారం దొరుకుతుంది కనుక మీరందరూ చిన్న సినిమా ను ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే నేను, సత్యం రాజేష్ మరియు ఈ చిత్ర హీరో విజయ్ భరత్ లు కలసి ఇదే ఎస్ ఎస్ సెల్యులాయిడ్స్ సంస్థ పై మరో చిత్రం  'బీగం' అనే  సినిమా చేయనున్నాము'' అని తెలియచేసారు.

ఇంకా ఈ ఆడియో వేడుక లో  సాయి వెంకట్, శోభ రాణి, డా. గురువ  నర్సయ్య, ఎ. పి. విప్ రవి కుమార్, లక్ష్మా రెడ్డి, అచ్చిరెడ్డి, ఉత్తేజ్  లతో పాటు ఈ చిత్ర ఎడిటర్ నందమూరి హరి, హీరో విజయ్ భరత్, హీరొయిన్ అశ్విని, సత్యం రాజేష్ లు తమ తమ భావాలను వ్యక్తపరచారు.

ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: మల్లిఖార్జున్, మాటలు: అంజన్, రచన: జయ కుమార్, పాటలు: చిర్రా వూరి విజయ కుమార్, కృష్ణ చిన్ని, చంద్ర కాటుబోయిన, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాత: పొట్నూరు శ్రీనివాసరావు, స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జై శ్రీరామ్. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs