Advertisement
Google Ads BL

'స్పీడున్నోడు' ఆడియో లాంచ్!


బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సొనారిక జంటగా తమిళ 'సుందరపాండ్యన్' కు రీమేక్ గా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'స్పీడున్నోడు'. భీమనేని సునీత నిర్మాత. డి.జె.వసంత్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.వి.వినాయక్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను తమన్నాకు అందించారు. హీరోయిన్ రెజినా థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా..

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ''సాయి పోస్టర్ రిలీజ్ అవుతుందన్న సినిమా రిలీజ్ అవుతుందన్న తన తల్లి తండ్రుల తరువాత సంతోషపడేది నేనే. సాయి నా హీరో. సినిమా ట్రైలర్ చూసి చాలా ఆనందపడ్డాను. కొన్ని సీన్స్ చూశాను. సాయి ఎంతో మెచ్యూర్డ్ గా నటించాడు. అల్లుడు శీను తో డాన్సులు ఎంత బాగా చేసాడని పేరొచ్చిందో ఈ సినిమాతో మంచి నటుడని పేరొస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. భీమనేని చాలా కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్. తమిల్, కన్నడలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదే కథ తీసుకొని ఈ సినిమా చేశారు. సుశ్వాగతం ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సినిమాకు మంచి బిజినెస్ జరిగింది'' అని చెప్పారు .

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''వసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నేను చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. అందరం మంచి పేరు తెచ్చుకోవాలని కష్టపడి వర్క్ చేశాం. కెమెరా వర్క్ చాలా బావుంటుంది. అల్లుడు శీను తరువాత పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ ఫిలింలో నటించాలనుకున్నాను. భీమనేని గారు స్క్రిప్ట్ చెప్పగానే బాగానచ్చింది. నేను అనుకున్న స్క్రిప్ట్ రావడంతో చాలా సంతోషపడ్డాను. తమన్నా స్పెషల్ సాంగ్ లో నటించింది. టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు'' అని చెప్పారు .

భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''మూడు సంవత్సరాలుగా ఓ రీమేక్ స్క్రిప్ట్ ను నమ్ముకొని వర్క్ చేశాం. నాతో పాటే మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ట్రావెల్ చేశాడు. సినిమా రిలీజ్ అయిన తరువాత మేము పడ్డ కష్టం అందరికి అర్ధమవుతుంది. నేను డైరెక్ట్ చేసిన 'సుస్వాగతం' , 'సూర్యవంశం' , 'శుభాకాంక్షలు' తరువాత అంత మనసుపెట్టి చేసిన సినిమా ఇది. ప్యాషనేట్ గా మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను. ఖచ్చితంగా ఈ  సినిమాతో ప్రేక్షకులు నన్ను మరో 5 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు'' అని చెప్పారు.

డి.జె.వసంత్ మాట్లాడుతూ.. ''స్క్రీన్ మీద పాటలు బాగా వచ్చాయంటే దానికి కారణం ఫోటోగ్రఫీ అండ్ సాయిశ్రీనివాస్ గారి ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్. ఒక యజ్ఞం లాగా ఈ సినిమా చేశాం. అందరూ హార్డ్ వర్క్ చేసి తీసిన సినిమా'' అని చెప్పారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''ట్రైలర్ బావుంది. భీమనేని శ్రీనివాస్ గారు చాలా ఎనర్జిటిక్ గా సినిమాలు తీస్తారు. ఈ సినిమా మంచి హిట్ కావాలి'' అని చెప్పారు. 

తమన్నా మాట్లాడుతూ.. ''బెల్లంకొండ సురేష్ గారు 'అల్లుడుశీను' సినిమాకు ముందు శ్రీనివాస్ డాన్సుల వీడియోలు చూపించారు. చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎప్పుడు లాంచ్ చేస్తున్నారని అడిగాను. వినాయక్ గారి లాంటి అమేజింగ్ డైరెక్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ సినిమాతోనే డాన్సులు, పెర్ఫార్మన్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాడు. 'స్పీడున్నోడు' పేరు సాయిశ్రీనివాస్ కు పర్ఫెక్ట్'' అని చెప్పారు. 

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ''సాంగ్స్ చాలా బావున్నాయి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

పోకూరి బాబురావు మాట్లాడుతూ.. ''సినిమా ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. తమిళంలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. సినిమాకు క్లైమాక్స్ చాలా ఇంపార్టంట్. హీరో క్యారెక్టరైజేషన్ చాలా స్పీడ్ గా ఉంటుంది. ప్రేమ కోసం, స్నేహం కోసం ఏదైనా చేసే ఒక కుర్రాడి కథే ఈ సినిమా. భీమనేని గారి సుడిగాడు కంటే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది'' అని చెప్పారు.

బి.ఏ.రాజు మాట్లాడుతూ.. ''అల్లుడు శీను సినిమాతో 40 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి సాయిశ్రీనివాస్ పెద్ద హీరో అయిపోయాడు. ఈ సినిమాలో డాన్సులు, ఫైట్స్ ఇరగదీసేశాడు. హిట్స్ మీద హిట్స్ ఇస్తోన్న భీమనేని శ్రీనివాస్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి పెద్ద హిట్ సినిమా ఇవ్వబోతున్నారు. బిజినెస్ లో కూడా ఈ సినిమా స్పీడ్ గా ఉంది. వసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కేథరిన్, సాక్షి చౌదరి, పూర్ణ, చంటి,గౌతంరాజు, వందేమాతరం శ్రీనివాస్, కబీర్, మధు నందన్, శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్, చంద్రబోసు, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి మ్యూజిక్: డి.జె.వసంత్, ఎడిటర్: గౌతంరాజు, కెమెరామెన్: విజయ్ ఉలాగనథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల, మాటలు: భీమనేని శ్రీనివాసరావు, ప్రవీణ్ వర్మ, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నే, నిర్మాత: భీమనేని సునీత, స్టొరీ డెవలప్మెంట్-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: భీమనేని శ్రీనివాసరావు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs