Advertisement
Google Ads BL

'కృష్ణగాడి వీరప్రేమ గాథ' పాటలు విడుదల!


నాని, మెహ్రెన్ కౌర్ జంటగా హను రాఘవపుడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'కృష్ణగాడి వీరప్రేమ గాథ'. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేష్ బాబు బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేశారు. అల్లరి నరేష్ థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

మహేష్ బాబు మాట్లాడుతూ.. ''14 రీల్స్ నా హోం బ్యానర్ లాంటిది. రామ్, అనిల్, గోపి డెడికేషన్ తో ఉండే ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. వాళ్లకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నాని నటించిన 'భలే భలే మగాడివోయ్' సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. అధ్బుతంగా నటించాడు. ఈ సినిమా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. డైరెక్టర్ హను మంచి టాలెంటెడ్ పెర్సన్. ఇండస్ట్రీకి ఇలాంటి దర్శకులే కావాలి. యువరాజ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం ఆనందంగా ఉంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

నాని మాట్లాడుతూ.. ''ఇది మాకు స్పెషల్ సినిమా. అందాల రాక్షసి సినిమా చూసిన తరువాత ఈ సినిమా చూస్తే షాక్ అవుతారు. హను అంత డిఫరెంట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి కాన్సెప్ట్. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. రామ్, గోపి నిర్మాతలగా కంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఈ సినిమాకు పని చేశారు. టెక్నీషియన్స్ అందరు కష్టపడి వర్క్ చేశారు'' అని చెప్పారు. 

సుకుమార్ మాట్లాడుతూ.. ''ఈ చిత్ర నిర్మాతలతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇలాంటి వ్యక్తులను నేను ఇప్పటివరకు చూడలేదు. ఎప్పడు నవ్వుతూనే ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు సక్సెస్ రావాలి. ట్రైలర్ లో కొన్ని పార్ట్స్ చూశాను. సినిమా హిట్ అయ్యేలా కనిపిస్తుంది. హను రాఘవపుడి డైరెక్ట్ చేసిన 'అందాల రాక్షసి' సినిమా చూశాను. తన స్టైల్ ఆఫ్ నేరేషన్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న యువరాజ్ కు మంచి పేరు రావాలి. సామాన్యంగా కనిపించే అసామాన్యులు నాని. విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజిక్ బావుంది. ప్రస్తుతం తెలుగొచ్చిన అతి కొద్ది మంది లిరిసిస్ట్స్ లో కృష్ణకాంత్ ఒకరు. సాంగ్స్ చాలా బాగా రాశారు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ''అభిరుచి ఉన్న నిర్మాతలు. హను రాఘవపుడి మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాతో ఆయన పెద్ద హిట్ కొడతారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. సినిమాలో పాటలు బావున్నాయి. నాని గురించి మాట్లాడితే నా గురించి మాట్లాడుకున్నట్లు అవుతుంది. చాలా మంచి నటుడు. తన స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే విధానం చాలా బావుంటుంది. 'భలే భలే మాగాడివోయ్' కంటే తను ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ.. ''సంవత్సరం క్రితం మేము చేసిన తప్పుల వలనో, వేరే కారణాల వలనో 14 రీల్స్ బ్యానర్ ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో మేము బావుండాలని సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఈరోజు టీం చేసిన ఎఫర్ట్ వలన మేము స్టాండర్డ్ గా ఉన్నాం. నాని చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది. తన బెస్ట్ పెర్ఫార్మ్ చేశాడు. నేను ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయింది తక్కువ. రామ్, గోపి నే చూసుకున్నారు. మేము ముగ్గురం కలిసి విని ఓకే  చేసిన సినిమాలు పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కవుట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. 

హను రాఘవపుడి మాట్లాడుతూ.. ''క్లిష్టమైన పరిస్థితుల్లో షూట్ చేశాం. కాని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు . యువరాజ్ నాతోనే ట్రావెల్ చేశాడు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కు మొదటి సినిమా అయినా చాలా బాగా వర్క్ చేశాడు. ప్రొడ్యూసర్స్ లేకపోతే ఈ సినిమా లేదు. చాలా సపోర్ట్ చేశారు. టెరిఫిక్ యాక్టర్ నాని. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ లా కూడా పని చేశాడు. మహాలక్ష్మి పాత్రలో మెహ్రేన్ బాగా నటించింది'' అని చెప్పారు. 

విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ''ఈ బ్యానర్ లో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అందరికి సినిమా, ఆడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

కృష్ణకాంత్ మాట్లాడుతూ.. ''దూకుడు, ఆగడు, 1 నేనొక్కడినే వంటి చిత్రాలను తెరకెక్కించిన 14రీల్స్ బ్యానర్ లో పని చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో పాటలన్నీ రాసే అవకాశం ఇచ్చిన హను గారికి థాంక్స్. విశాల్ చంద్రశేఖర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మెహ్రేన్, రామ్ అచంట, గోపి ఆచంట, స్రవంతి రవికిశోర్, అభిషేక్, రత్నవేలు, అవినాష్, వాసు తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: గౌతం రాజు, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: హను రాఘవపుడి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs