హాస్యల చిత్రాల కథానాయకుడుగా... ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న సీనియర్ నటుడు నరేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న నరేష్ జన్మదిన వేడుక క్రిష్ణ, విజయనిర్మల దంపతులు, అభిమానులు సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, శివక్రిష్ణ తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ... ''నరేష్ కెరీర్ లో ఎక్కువుగా కామెడీ హీరోగా చేసినప్పటికీ... 'సాహసమే నా ఊపిరి' లాంటి యాక్షన్ మూవీస్ కూడా చేసాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. మరిన్ని మంచి పాత్రలు పోషించి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ''చిన్నప్పటి నుంచి నరేష్ నేను ట్విన్స్ లా పెరిగాం. మంచి మనసున్న నరేష్ మరో 50 ఏళ్లు ఇలాగే పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
నరేష్ మాట్లాడుతూ... ''క్రిష్ణ గారు అమ్మ విజయనిర్మల ఇద్దరు నాకు రెండు పిల్లర్స్ లా నా కెరీర్ కి ఎంతగానో సహకరించారు. 2015 లో నేను నటించిన 'దృశ్యం, భలే భలే మగాడివోయ్' సినిమాలు ఘన విజయం సాధించడం చాలా సంతోషం కలిగించింది. 2016 జనవరి 1 రిలీజైన 'నేను..శైలజ' సినిమాలో మంచి పాత్ర పోషించాను. ఈ సినిమాతో ఈ సంవత్సరంలో నాకు సక్సెస్ స్టార్ట్ అయ్యింది. మహేష్ నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' సినిమాలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాను. ఎప్పటి నుంచో మహేష్ తో కలసి నటించాలనుకున్నాను. అది 'బ్రహ్మోత్సవం' సినిమాతో నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో 'అ ఆ' సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నదియాతో కలిసి నటిస్తున్నాను. సినిమాను మలుపు తిప్పేకీ రోల్ పోషిస్తున్నాను. అలాగే సాయికుమార్ తనయుడు ఆది తో కలసి నటించిన 'గరం' త్వరలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేసాను. అలాగే నూతన దర్శకురాలు చునియా దర్శకత్వంలో 'పడేసావే' సినిమాలో నటిస్తున్నాను. 2016 నాకు మరింత పేరు తెస్తుందని గట్ట నమ్మకం. కృష్ణ గారు నటిస్తున్న 'శ్రీశ్రీ' లో పోలీసాఫీసర్ గా కీలక పాత్ర పోషిస్తున్నాను. అలాగే మా అబ్బాయి నవీన్ నటిస్తున్న 'ఐనా ఇష్టం నువ్వు' ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతుంది. అన్నిరకాలుగా 2016 నాకు ఆల్ రౌండర్ గా మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.