Advertisement
Google Ads BL

అసిన్‌ పెళ్ళి కూతురైంది.!


గజిని, శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, లక్ష్మీనరసింహా వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ అసిన్‌. తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న అసిన్‌ గత రెండు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా వుంటున్న విషయం తెలిసిందే. ఈ రెండేళ్ళుగా మైక్రోమాక్స్‌ మొబైల్స్‌ ఫౌండర్‌ రాహుల్‌శర్మతో నిండా ప్రేమలో మునిగిపోయిన అసిన్‌ ఈరోజు అతన్ని వివాహం చేసుకుంది. ఢిల్లీలోని ఓ చర్చిలో పూర్తిగా ప్రైవేట్‌ ఫంక్షన్‌లా నిర్వహించిన ఈ వేడుకలో అసిన్‌, రాహుల్‌శర్మ ఒక్కటయ్యారు. అక్షయ్‌కుమార్‌ హీరోగా వచ్చిన ఆల్‌ ఈజ్‌ వెల్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అసిన్‌ ఆ సినిమా టైమ్‌లోనే రాహుల్‌శర్మ పరిచయమయ్యాడు. ఇద్దరి అభిరుచులూ కలవడంతో అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు. ఈరోజు ఉదయం చర్చిలో పెళ్ళి చేసుకున్న ఈ జంట ఢిల్లీలోనే సాయంత్రం దుసిట్‌ దేవరన రిసార్ట్స్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్ళి చేసుకున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs