Advertisement
Google Ads BL

నా లైఫ్ లో అనుభూతిని మిగిల్చిన చిత్రం:ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్య సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ ఎల్ పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రం టైటిల్ సాంగ్ లాంచ్ శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ''నా జీవితంలో మంచి అనుభూతిని మిగిల్చిన చిత్రమిది. ఇది సక్సెస్ మాత్రమే కాదు.. ఒక ఫీల్. 'నాన్నకు ప్రేమతో' సినిమా ఒక బొమ్మయితే దేవిశ్రీ తన మ్యూజిక్ తో ఆ బొమ్మకు ప్రాణం పోశాడు. సత్యమూర్తి గారే దేవీతో ఇంతమంచి పాట రాయించారనుకుంటున్నాను. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాట కోసం చాలా మంది ప్రేక్షకులు థియేటర్స్‌లోనే ఉండిపోయారు. రకుల్ ప్రీత్ సింగ్ చాలా బాగా నటించిందని మొదటిసారి మా అమ్మ ఒక హీరోయిన్ గురించి మాట్లాడింది. ఎంతో డెడికేషన్‌తో వర్క్‌ చేసింది. తన పాత్రకు తనే డబ్బింగ్‌ కూడా చెప్పుకుంది. తనకి హ్యట్సాఫ్‌. ఇంత మంచి సినిమాను ఇచ్చినందుకు నిర్మాత ప్రసాద్‌గారికి థాంక్స్‌. మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. రాజేంద్రప్రసాద్‌గారు తన నటనతో నాన్న పాత్రకు ప్రాణం పోశారు. ఆయన వలనే టైటిల్‌లోని నాన్నకు అనే మాటకు అర్థం వచ్చింది. అలాగే జగపతిబాబు కూడా విలన్‌గా అధ్బుతంగా నటించారు. 'టెంపర్‌', 'నాన్నకు ప్రేమతో..' వంటి డిఫరెంట్‌ మూవీస్‌ చేయడానికి నన్ను ప్రోత్సహిస్తోన్న అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పాటకు వీడియోస్‌, ఫోటోస్‌ను కట్‌ చేసి nkptsong@gmail.com అనే ఈ మెయిల్‌కు పంపిన వారిలో బెస్ట్ ను సెలెక్ట్ చేసి సత్కరించాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

సుకుమార్‌ మాట్లాడుతూ.. ''దేవిశ్రీ సినిమా షూటింగ్ ఆఖరి రోజు రాత్రికి రాత్రే ఈ సాంగ్‌ను కంపోజ్‌ చేశాడు. సత్యమూర్తిగారికి ఈ సినిమాను డెడికేట్ చేయడం ఆనందంగా ఉంది. రాజేంద్రప్రసాద్‌గారి వలనే నేను ఈరోజు డైరెక్టర్ ను అయ్యాను. ఆయనను డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. రత్నవేలు బిజీగా ఉండటంతో నాకు వేరే ఆప్షన్‌ ఎవరని ఆలోచించిన సమయంలో విజయ్‌ కనపడ్డాడు. తను సినిమా కథను ఎక్కడా మిస్‌ కాకుండా చూసుకున్నాడు. రకుల్‌ ఎంతో ఇన్‌వాల్వ్‌ అయ్యి నటించింది. ఇక తారక్‌ లేకపోతే ఈ సినిమాయే లేదు. తారక్‌ అంటే 'నాన్నకు ప్రేమతో...'. 'నాన్నకు ప్రేమతో...' అంటే తారక్‌.  నిర్మాత ప్రసాద్‌ గారు సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న వ్యక్తి'' అని చెప్పారు.

దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ.. ''అందరికి చాలా ఎమోషన్స్‌ ఉంటాయి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అయ్యేది ఒక అమ్మ, నాన్న ఎమోషన్స్‌కు మాత్రమే. ఇంత ఎమోషనల్‌ మూవీని ఎక్కడా డ్రాప్‌ కాకుండా కమర్షియల్‌గా డైరెక్ట్‌ చేసిన సుకుమార్‌గారికి థాంక్స్‌. కమర్షియల్‌ హీరో అయిన ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటించినందుకు థాంక్స్‌. ఈ సినిమా నా నిజ జీవితానికి దగ్గరగా ఉంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారు చివరి సీన్‌లో నవ్వుతూ చనిపోయినట్లు యాక్ట్‌ చేశారు. మా నాన్నగారు కూడా నవ్వుతూ అమ్మను చూస్తూ కన్నుమూశారు. సుకుమార్‌, ఎన్టీఆర్‌, ప్రసాద్‌గారు ఈ సినిమాను మా నాన్నగారికి అంకితం ఇచ్చినందుకు థాంక్స్‌. సత్యమూర్తి గారి కొడుకునని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను'' అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కె.చక్రవర్తి, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs