Advertisement
Google Ads BL

సమ్మర్ సూపర్ హిట్ బ్రహ్మోత్సవమే: కృష్ణ


సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బ్రహ్మోత్సవం'. నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జనవరి 1న విడుదల చేశారు. ఈ టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. 

Advertisement
CJ Advs

ఈ టీజర్‌ గురించి సూపర్‌స్టార్‌ కృష్ణ స్పందిస్తూ.. '' బ్రహ్మోత్సవం' టీజర్‌ చూశాను. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. మహేష్‌ చేసిన సినిమాలన్నింటి కంటే ఈ సినిమాలో చాలా బాగున్నాడు. టీజర్‌ చూస్తుంటేనే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనే విషయం ఎస్టాబ్లిష్‌ అయింది. సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 29న రిలీజ్‌ అవుతుందని చెప్పారు. సమ్మర్‌ సినిమాల్లో 'బ్రహ్మోత్సవం' నెంబర్‌ వన్‌ సినిమాగా నిలబడుతుందని, నిలబడాలని ఆశిస్తున్నాను'' అన్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs