Advertisement
Google Ads BL

'బేబీ డాల్‌' షూటింగ్‌ ప్రారంభం!


మానస్‌ హీరోగా రైజింగ్‌ సన్‌ ఫిలింస్‌ పతాకంపై హాషిక దత్‌ హీరోయిన్‌గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం 'బేబీడాల్‌'. ఈ చిత్రాన్ని తాజ్‌ మహ్మద్‌ నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 28న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి కోడైరెక్టర్‌ జగదీష్‌ పల్లి క్లాప్‌నివ్వగా, సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో మానస్‌, హీరోయిన్‌ కమ్‌ డైరెక్టర్‌ హాషిక దత్‌, నిర్మాత తాజ్‌ మహ్మద్‌, సినిమాటోగ్రాఫర్‌ రాఘవ నూలేటి, సంగీత దర్శకుడు మున్నా కాశి, మాటల రచయిత రవిశంకర్‌ పర్రి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

హీరోయిన్‌, దర్శకురాలు హాషిక దత్‌ మాట్లాడుతూ.. ''ప్రతి అబ్బాయికీ ఒక డ్రీమ్‌ వుంటుంది. తను ప్రేమించే ఎలా వుండాలి అనేది అతను ఇమాజిన్‌ చేసుకుంటాడు. దానికి మేం తెలుగులో 'బేబీడాల్‌' అని పేరు పెట్టాం. ఈ చిత్రాన్ని తమిళ్‌ వెర్షన్‌లో తమిళ ఆర్టిస్టులతో చేస్తున్నాం. ఈ రెండు లాంగ్వేజెస్‌లో ఏకకాలంలో షూటింగ్‌ జరుగుతుంది. ఈ సినిమాని ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. ప్రత్యేకంగా యూత్‌కి నచ్చే సీన్స్‌, డైలాగ్స్‌ ఈ చిత్రంలో వుంటాయి. ఈ సినిమాకి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ నెల్లూరులో చేయబోతున్నాం. జనవరి 8 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌ ఎవరు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మానస్‌ అయితే పర్‌ఫెక్ట్‌గా సరిపోతాడనిపించింది. ఆల్రెడీ అతను చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా మానస్‌కి మంచి పేరు తెస్తుంది'' అని అన్నారు. 

హీరో మానస్‌ మాట్లాడుతూ.. ''లైన్‌ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాలో వుంటుంది. సాధారణంగా ప్రతి సినిమాలో హీరో డామినేషన్‌ వుంటుంది. కానీ, ఈ సినిమాలో హీరోయిన్‌ పెర్‌ఫార్మెన్స్‌కి ఎక్కువ స్కోప్‌ వుంది. దానికి తగ్గట్టుగానే నా క్యారెక్టర్‌ కూడా వుంటుంది. నేను ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశాను. అలాగే హీరోగా కూడా నటించాను. ఈ సినిమా నాకు హీరోగా మంచి బ్రేక్‌ ఇస్తుందనుకుంటున్నాను'' అని అన్నారు. 

సంగీత దర్శకుడు మున్నా కాశి మాట్లాడుతూ.. ''హాషిక నాకు మంచి ఫ్రెండ్‌. ఆమె హీరోయిన్‌గా నటించడమే కాకుండా డైరెక్షన్‌ కూడా చేస్తోందని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఈ చిత్రంలో ఐదు పాటలు వుంటాయి. ఈ వారంలో పాటలు రికార్డింగ్‌కి వెళ్తున్నాయి. ఒక్కో పాట ఒక్కో జోనర్‌లో వుంటూ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తాయి'' అన్నారు. 

సినిమాటోగ్రాఫర్‌ రాఘవ నూలేటి మాట్లాడుతూ.. ''హాషికగారు తప్పకుండా ఈ సినిమా చేయాలని అడిగారు. కథ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా తప్పకుండా చేస్తానని చెప్పాను. ఈ సినిమా పోస్టర్‌ చాలా వెరైటీగా వుంది. ఇది మంచి డిఫరెంట్‌ మూవీ అవుతుందని నమ్ముతున్నాను'' అన్నారు. 

మాటల రచయిత రవిశంకర్‌ పర్రి మాట్లాడుతూ.. ''ఈ సినిమాకి మాటలు రాసే మంచి అవకాశాన్ని ఇచ్చిన హాషికగారికి థాంక్స్‌. ఇందులోని ప్రతి డైలాగ్‌ యూత్‌కి బాగా నచ్చుతుంది. అలాగే యూత్‌ ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్‌ అవుతుంది'' అన్నారు. 

మానస్‌, హాషిక, నరేష్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, సంపూర్ణేష్‌బాబు, తాగుబోతు రమేష్‌, సప్తగిరి, సితార, పూర్ణిమ, భాగ్యరాజ్‌, సముద్రఖని, సతీష్‌, ఇమ్రాన్‌ అనాచి, మొట్టయ్‌ రాజేంద్రన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మున్నా కాశి, సినిమాటోగ్రఫీ: రాఘవ నూలేటి, మాటలు: రవిశంకర్‌ పర్రి, ఎడిటింగ్‌: అనిల్‌కుమార్‌ జల్లు, విజువల్‌ ఎఫెక్ట్స్‌: కార్టూనిస్ట్‌ నవీన్‌, స్టిల్స్‌: శ్రీ, మేకప్‌: పవన్‌, కాస్ట్యూమ్స్‌: రాజు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: ఎ.ఏడుకొండలు, వై.సురేష్‌బాబు, కోడైరెక్టర్స్‌: రాజరాజన్‌ ఆర్క్‌, జగదీష్‌ పల్లి, నిర్మాత: తాజ్‌ మహ్మద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హాషిక దత్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs