2015వ సంవత్సరం స్టార్టింగ్ లో రిలీజ్ అయిన బాహుబలి సినిమా, అందులో నటుడు ప్రభాకర్ మాట్లాడే కిలిక్కి భాష ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరు ఈ కిలిక్కి భాషను ఎంజాయ్ చేశారు. అయితే తాజాగా సింగర్ స్మిత ఈ కిలిక్కి భాషను ఆధారంగా చేసుకొని ఓ వీడియో పాటను కంపోజ్ చేశారు. ఎం.ఎం.కీరవాణి ఈ పాటను బుధవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..
కీరవాణి మాట్లాడుతూ.. ''స్మిత ఎంతో నిజయితీగా, ప్యాషన్ తో వర్క్ చేస్తుంది. తన ఫ్యామిలీ కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. ఈ సాంగ్ మంచి హిట్ కావాలి. ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
స్మిత మాట్లాడుతూ.. ''బాహుబలి సినిమా చూసిన తరువాత కిలిక్కి భాషలో ఓ వీడియో సాంగ్ చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే బాహుబలి కిలిక్కి భాషకు మాటలు అందించిన మదన్ కార్కి ని సంప్రదించాను. నేను అడిగిన రెండు రోజుల్లోనే తను పాట లిరిక్స్ అందించారు. ఆ పాటకు బాస్కో కోరియోగ్రఫీ అందించడం ఎప్పటికి మర్చిపోలేను. నిజానికి ఈ పాట ఇదివరకే విడుదల చేయాల్సింది కాని చెన్నై వరదల కారణం పోస్ట్ పోన్ చేశాం. ఈ పాట కోసం నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
మదన్ కార్కి మాట్లాడుతూ.. ''బాహుబలి సినిమా చేసేప్పుడు రాజమౌళి గారికి కిలిక్కి భాషలో పాట ఉంటే బావుంటుందని చెప్పాను. కాని స్పేస్ లేక సాంగ్ పెట్టడం కుదరలేదు. స్మిత గారు వచ్చి కిలిక్కి భాషలో పాట చేయాలనగానే సంతోషంగా అనిపించింది. ఈ సాంగ్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మెహర్ రమేష్, శోభు యార్లగడ్డ, నోయల్ తదితరులు పాల్గొన్నారు.