Advertisement
Google Ads BL

జానకి రాముడు, మగధీర..ఇప్పుడు ‘వ‌ల్లీ’!


ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు విజయేంద్ర‌ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ బృందావ‌న్ నిర్మిస్తున్న చిత్రం వ‌ల్లీ. నేహ హింగే, ర‌జ‌త్‌కృష్ణ‌, అర్హ‌న్‌, రాజీవ్ క‌న‌కాల ప్ర‌ధాన తారాగ‌ణం.ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ కార్య‌క్రమంలో నేహ హింగే, ర‌జ‌త్‌కృష్ణ‌, సూఫీ, అర్హ‌న్‌, నిర్మాత రాజ్‌కుమార్ బృందావ‌న్‌, నిర్మాత స‌తీమ‌తి సునీత‌, రాజీవ్ క‌న‌కాల‌, కెప్టెన్ చౌద‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు. రాజ్‌కుమార్ బృందావ‌న్‌, శ్రీమ‌తి  సునీత ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. అనంతరం 

Advertisement
CJ Advs

ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ..'మానవాళి అభివృద్ధి కోసం మనిషి మనసుని పరిశోధించే యంత్రాన్ని కనుగొనే ప్రయత్నాలో ఉన్న ఒక ప్రొఫెసర్‌ (అశోక్‌ మల్హోత్ర). భారతదేశంలో వైజ్ఞానిక పరిశోధనలకు డబ్బు అడ్డంకి కాకూడదని తన యావదాస్థిని దానం చేసే ఒక సైంటిస్ట్‌ (రామచంద్ర). ఆయన కూతురికి తన ఆశయాన్ని, ప్రొఫెసర్‌ అశోక్‌ మల్హోత్ర స్టూడెంట్‌గా అతని లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నాలో ఉన్న హీరోయిన్‌ (వల్లి). అలాంటి అమ్మాయిని ప్రేమించి ఆరాధించి, అమె కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తియ్యడానికైనా సిద్ధమయ్యే చిన్ననాటి స్నేహితునిగా హీరో (రజత్‌కృష్ణ). వెయ్యి సంవత్సరాలుగా తన ప్రేయసి కోసం ఎదురుచూస్తున్న మజ్ను పాత్రలో (అర్హాన్‌) నటించారు. బ్రెయిన్‌ వేవ్‌ ఎక్స్‌పెరిమెంటల్‌లో పాల్గొనడంతో వల్లికి గత జన్మ స్మృతులు గుర్తుకు వచ్చి, పూర్వజన్మలో ఆమె లైలా అన్న విషయం తెలుస్తుంది. వేయి సంవత్సరాలుగా ఎదురు చూసి వెదుక్కుంటూ వచ్చిన ప్రియుడు మజ్ను, తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితుడు.. వీరిద్దరి మధ్య సతమతమవుతున్న వల్లీకి, ఆండ్రియా అనే లెస్బియన్‌ రూపంలో మరో సమస్య ఎదురవుతుంది. ఇవి కాకుండా ఇంకా ఎన్నో విచిత్రమైన సమస్యలు, విపత్కర పరిస్థితులు వల్లిని చుట్టుముడతాయి. ఈ సమస్యన్నింటినీ వల్లి ఏవిధంగా అధిగమించింది. వాటి నుండి తన ప్రాణాలను ఏవిధంగా కాపాడుకుంది. తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? అనేదే ఈ చిత్ర కథ. సైన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన రొమాంటిక్‌, ఏరోటిక్‌ థ్రిల్లర్ చిత్రమే ఈ వల్లి. డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న ఎరోటిక్ థ్రిల్ల‌ర్‌. కొత్త కాన్సెప్ట్‌. అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది..' అన్నారు.

నటుడు రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ..'విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారు త‌న‌కు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ను కూల్‌గా రాబట్టుకుంటారు. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం హ్య‌పీగా ఉంది. సినిమా అనుకున్న దానికంటే బాగా వ‌చ్చింది..' అన్నారు.

నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ ..'ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్రాలు చేయాల‌ని రేష్మాస్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశాం. విజ‌యేంద్ర్ర‌ప్ర‌సాద్ వంటి గొప్ప వ్య‌క్తి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి' అన్నారు.

శ్రీమ‌తి సునీత మాట్లాడుతూ..'విజ‌యేంద్రప్ర‌సాద్‌గారు మా అంద‌రిలో స్ఫూర్తిని నింపి సినిమాను అద్భుతంగా తీశారు. ఆయ‌న‌తో మ‌రిన్ని చిత్రాలు చేయాల‌నుకుంటున్నాం' అన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs