Advertisement

రజనీకాంత్‌, శంకర్‌ల 2.0(రోబో సీక్వెల్‌) ప్రారంభం


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా రూపొందించబోతున్నానని గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబో సీక్వెల్‌ డిసెంబర్‌ 16న చెన్నయ్‌లో ప్రారంభమైంది. 2.0 పేరుతో 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాష్‌ కరణ్‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన ప్రతి చిత్రాన్ని టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందించే శంకర్‌ ఈ చిత్రాన్ని అంతకు మించిన స్థాయిలో హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో రూపొందించబోతున్నారు. 

Advertisement

ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్ర నిర్మాత, లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాష్‌ కరణ్‌ భావించారు. అయితే ఇటీవల తమిళనాడులో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో వుంచుకొని చాలా నిరాడంబరంగా 2.0 చిత్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌, దర్శకుడు శంకర్‌, సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌, లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాష్‌ కరణ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ముత్తురాజ్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ మోహన్‌, సినిమాటోగ్రాఫర్‌ నిరవ్‌ షా తదితరులు పాల్గొన్నారు. 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ ఎంతో కీలకమైన పాత్రని పోషిస్తారు. రోబో చిత్రానికి అత్యద్భుతమైన సంగీతాన్ని అందించిన ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌.రెహమాన్‌ 2.0 చిత్రానికి కూడా సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని 3డి ఎఫెక్ట్‌లో కంప్లీట్‌ వరల్డ్‌ క్లాస్‌ మూవీగా ప్రపంచంలోని టాప్‌ టెక్నీషియన్స్‌తో రూపొందిస్తున్నారు. జురాసిక్‌ పార్క్‌, ఐరన్‌ మేన్‌, అవెంజర్స్‌ వంటి హాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రాలకు అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ని అందించి ప్రపంచంలోనే నెం.1 సంస్థగా పేరుపొందిన ఏనిమాట్రానిక్స్‌ కంపెనీ ఈ చిత్రం కోసం పనిచేయడం విశేషం. 

ట్రాన్‌, వాచ్‌మేన్‌ వంటి అద్భుత చిత్రాలకు కాస్ట్యూమ్స్‌ని డిజైన్‌ చేసిన మేరీ ఇ.వోట్‌ 2.0 చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్స్‌ చిత్రానికి యాక్షన్‌ సీక్వెన్స్‌లను కంపోజ్‌ చేసిన కెన్నీ బేట్స్‌, లైఫ్‌ ఆఫ్‌ పై చిత్రానికి విఎఫ్‌ఎక్స్‌ చేసిన జాన్‌ హ్యూజ్స్‌ వంటి హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ ఈ చిత్రానికి వర్క్‌ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ ఎంతో ప్రాధాన్యత వున్న పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా, ఎడిటింగ్‌: ఆంటోని, ఆర్ట్‌ డైరెక్టర్‌: ముత్తురాజ్‌, సౌండ్‌ డిజైనర్‌: రసూల్‌ పూకుట్టీ, కాస్ట్యూమ్స్‌: మేరీ ఇ.వోగ్‌, ఫైట్స్‌: కెన్నీ బేట్స్‌, విఎఫ్‌ఎక్స్‌: జాన్‌ హ్యూజ్స్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: శ్రీనివాస్‌ మోహన్‌, నిర్మాత: సుభాష్‌ కరణ్‌, కథ, స్క్రీన్‌పే, దర్శకత్వం: శంకర్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement