Advertisement

'ఆటాడుకుందాం రా' టాకీ పార్ట్ పూర్తి!


సుశాంత్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీ నాగ కార్పొరేషన్ శ్రీ జి ఫిలిమ్స్ బ్యానర్ పై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీల నిర్మిస్తున్న చిత్రం ''ఆటాడుకుందాం రా..''. ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

Advertisement

హీరో సుశాంత్ మాట్లాడుతూ.. ''సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ఇంకా సాంగ్స్ బ్యాలన్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారు చాలా ఫాస్ట్ గా సినిమా తీశారు. నేను ఇప్పటివరకు ఇలాంటి జోనర్ లో సినిమా చేయలేదు. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండే చిత్రమిది. నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. శ్రీధర్ సీపాన చెప్పిన కథను డైరెక్టర్ గారు నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్ళారు. సినిమాలో నన్ను కొత్తగా చూపించారు'' అని చెప్పారు.

దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''నేను చాలా కామెడీ సినిమాలు చేశాను. ఎంటర్టైన్మెంట్ లేకుండా ఇప్పటివరకు సినిమాలు చేయలేదు. సీరియస్ సినిమాలు చేయడం రాదు. నేను ఇంతకముందే సుశాంత్ కు ఒక స్టొరీ చెప్పాను. ఆ సినిమా చేయడానికే పిలిపించారనుకున్నాను. కాని శ్రీధర్ సీపాన చెప్పిన కథ వినమని చెప్పారు. స్టొరీ బాగా నచ్చింది. సినిమాలో ఎమోషనల్ కామెడీ ఉంటుంది. ఇద్దరు స్నేహితులు విడిపోయే ఎమోషనల్ ఎలిమెంట్ సినిమాకు మెయిన్ బేస్. ఇప్పటికే 50 రోజులు టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాం. మరో ఇరవై రోజులు సాంగ్స్ షూటింగ్ ఉంది. సుశాంత్ కామెడీ చాలా బాగా చేసాడు. సినిమా బాగా రిచ్ గా ఉంటుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఖరీదైన లోకేషన్స్ లో షూట్ చేశాం. ఖచ్చితంగా ప్రేక్సహ్కులకు నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

నాగ సుశీల మాట్లాడుతూ.. ''స్టొరీ బాగా నచ్చింది. కథ విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాం. సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తయింది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం'' అని చెప్పారు.

చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''మా బ్యానర్ లో ఇది నాల్గవ చిత్రం. నాగేశ్వరరెడ్డి గారు ఈ సినిమాకు పెద్ద అసెట్. శ్రీధర్ సీపాన గారు మంచి స్టొరీ ఇచ్చారు. టాకీ, యాక్షన్ పార్ట్ పూర్తయింది. జనవరిలోపు పాటలను చిత్రీకరించి సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

శ్రీధర్ సీపాన మాట్లాడుతూ.. ''నాగార్జున గారితో సినిమా చేయాలనుకున్నాం. వారి మేనల్లుడితో చేసే అవకాశం వచ్చింది. ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. టైం మెషిన్ అనేది ఈ సినిమాలో కీలకమైన పాయింట్. 'లౌక్యం' తరువాత అంత పేరు తెచ్చిపెట్టే సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.   

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement