Advertisement
Google Ads BL

'రజినికాంత్ డ్రెస్సింగ్ రూమ్'తో సినిమా!


'కలర్ విజన్' ఆధారంగా రూపు దిద్దుకాబోతున్న 'రజినీకాంత్ డ్రెస్సింగ్ రూమ్' ప్రెస్ నోట్ కథా ముఖ్యంశము: సినిమాల ప్రకారం ఇప్పటివరకు దెయ్యాలను వివిధ రూపాల్లో అంటే తొలి రోజుల్లో తెల్ల చీరల్లో తరువాత వింత రూపాల్లో టెక్నాలజీకి అనుగునంగా సృష్టించుకుంటున్నాం. మరీ కంప్యుటర్ గ్రాఫిక్స్ వచ్చాక వివిధ రూపాల్లో మనం చూస్తున్న శరీరమే లేని ఈ  దెయ్యాలు.. అసలు మనుషులని చూడగలుగుతాయా..? ఒకవేళ చూస్తే మనుషులు, సమస్త జీవకోటిని ఏ రంగులో చూస్తాయో  చెప్పడమే ఈ కథ ముఖ్య ఉద్దేశం.                            

Advertisement
CJ Advs

'బందూక్' అనే ఒక సామజిక వ్రుతాంతో విజయ వంతమైన సినిమా అందించిన దర్శకుడు లక్ష్మన్ మురారి తన మొదటి చిత్రానికే అవార్డ్ లు, రివార్డులు సంపాదించుకున్నాడు. ఆ సినిమా జాతీయ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. మరోసారి సామాజిక కోణంలోనే తన ద్వితీయ సినిమాను రూపొందించుటకు ప్రయత్నాలు జరుపుతున్నాడు.. ఈ చిత్రం లో కూడా  నేషనల్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తున్న ఒక ప్రాబ్లం గురించి చర్చిస్తున్నారు. 'కలర్ విసన్' ఆధారంగా రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి ''రజినీకాంత్ డ్రెస్సింగ్ రూమ్'' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు తమిళ్ భాషల్లో రూపుదిద్దికుంటున్న ఈ చిత్రంలో 45 నిమిషాల గ్రాఫిక్స్ కోసం లాస్ఏంజిల్స్ లోని ''ప్రిస్విస్ స్టూడియో'' తో కలిసి నిర్మిస్తున్నారు.                                                                                  

మానవులు ప్రపంచంలోని ఎన్నో వర్ణాలు, ఎన్నెన్నో రంగులను చూస్తున్నట్లుగా మిగతా ఏ ప్రాణులు చూడలేవు. అంటే మనుషులు చూస్తున్న ప్రకృతిలోని రంగులు కుక్కలకు ఒక రకంగాను, నెమలికి ఒక రకంగాను, పిల్లులకు ఒక రకంగాను, బుల్స్ కి ఒక రకంగాను, క్రిమీ కీటకాలకు, పాములకి, చేపలకి, చివరకు ఎలుకలకు సైతం వివిధ రంగుల్లో కనిపిస్తుంది. అంటే ఈ ప్రపంచం ఒక జీవికి కనిపిస్తున్నట్టుగా ఇంకో జీవికి కనిపించదు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఈ కలర్ విజన్ తాలుకు నిజాన్ని తెలియపరిచారు. అది ఎలా అనగా  జీవకోటి యొక్క ఈ  కంటి చూపు తమ తమ  శరీర ఆకృతిని బట్టే ఉంటుంది. అంటే తమ తమ శరీర ఆకృతి ప్రకారమే సమస్త జీవకోటి ఒకే వస్తువుని కాని, ఒకే పరదేశాన్ని కాని వివిధ రంగుల్లో చూస్తుంటాయి. కంటి చూపుకి శరీరాకృతే ప్రధాన కారణం. అలాంటప్పుడు శరీరమే లేని ఆత్మలు అసలు ప్రపంచాన్ని చూడగలుగుతాయా? ఒక వేళ చూడగలిగితే ఈ ప్రపంచం, ప్రపంచంలోని మనుషులు, వస్తువులు ఈ ఆత్మలకి ఏ రంగులో కనిపిస్తాయి..?

ఆత్మలను మనం పుస్తకాల్లో చదవడం, సినిమాల్లో చూడటం మాత్రమే జరుగుతుంది. (ఎవరైన ఆత్మలని చూసారంటే అది వారి వ్యక్తిగతమే. వాళ్ళ మానసిక స్థితి లేకపోవడంవలనో.. లేకా భ్రమనో ఆత్మలను చూసినట్లుగా అనుభూతి చెందుతారు ) పూర్వకాలం లో ఆత్మలను చూసినట్లుగా, ఆత్మలతో మాట్లాడినట్లుగా, మనిషి శరీరంలో ప్రవేశించిన ఆత్మలను వెళ్ళగొట్టేందుకు మంత్రగాళ్ళు చేసిన విద్యలన్నీ కల్పితమే లేదా మూఢ నమ్మకాలుగా అందరు చెప్తుంటారు.

అసలు ఈ దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? అన్నది ఇప్పటికి అంతు చిక్కని ప్రశ్నే!

కాని ఈ దెయ్యాలు మనుషులని పట్టి పీడుస్తున్నా, వికృత చేష్టలు చేయించి ఇంకొకరిని బాధించినా ఇదంతా తమ చిరకాలవాంఛ తీర్చుకోవడం కోసమే. అంటే తమ తమ కోరికలు తీరిన వెంటనే దెయ్యాలు మనుషుల శరీరాలను విడిచి విముక్తి పొందుతాయని నానుడి. ఈ సినిమా కూడా ఒక సామాజిక కోణం లోనే ఉంటుంది.

త్వరలో సెట్స్ పైకి వెళ్తున్న ఈ చిత్రం తాలుకు మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేస్తాము.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs