Advertisement
Google Ads BL

'కిల్లింగ్‌ వీరప్పన్‌' విడుదలకు సిద్ధం!


తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను గడ గడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ పై సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ రూపొందించిన చిత్రం 'కిల్లింగ్‌ వీరప్పన్‌'. ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్‌ సమర్పణలో జి ఆర్‌ పిక్చర్స్‌ మరియు జెడ్‌ త్రీ ప్రొడక్షన్స్‌ సంస్థలపై బీవి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బిఎస్‌ సుధీంద్ర సంయుక్తంగా నిర్మించారు. 'రక్త చరిత్ర', '26/11' చిత్రాల తరహాలో 'కిల్లింగ్‌ వీరప్పన్‌' చిత్రాన్ని వర్మగారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది అంటున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

చిత్ర దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మాట్లాడుతూ... ''తమిళనాడు, ర్ణాటక, కేరళ ఈ మూడు రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెట్టిన వీరప్పన్‌ని చంపడానికి పోలీసు వ్యవస్థ ఎలాంటి ప్రణాళికలు రూపొందించింది. ఎంత డబ్బు, సమయాన్ని వెచ్చించింది అనేది వాస్తవంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. పోలీస్‌ ఆఫీసర్‌గా శివరాజ్‌ కుమార్‌, వీరప్పన్‌గా సందీప్‌ భరద్వాజ్‌ అద్భుతమైన నటన కనబరిచారు. ఇటీవల సెన్సార్‌ పూర్తి చేశాము. ఈ నెల 18న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం'' అని అన్నారు. 

శివరాజ్‌ కుమార్‌, సందీప్‌ భరద్వాజ్‌, యజ్ఞాశెట్టి, పరూల్‌ యాదవ్‌, రాక్‌లైన్‌ వెంకటేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రమ్మీ; సంగీతం:రవిశంకర్‌; ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ; ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సధీర్‌ చంద్ర పధిరి; నిర్మాతలు:బీవి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బిఎస్‌ సుధీంద్ర; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs