Advertisement
Google Ads BL

‘ప్రేమంటే సులువు కాదురా’ పాటలు విడుదల!


ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. సిమ్మీదాస్ హీరోయిన్.  యువ ప్రతిభాశాలి చందా గోవింద్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆర్‌.పి.ప్రొడక్షన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొమారి సుధాకర్‌రెడ్డి-శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు.  కృష్ణ మాదినేని సాహిత్యం సమకూర్చగా.. నందన్‌రాజ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమా గీతాలు ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ ‘మధుర ఆడియో' ద్వారా మార్కెట్‌లో లభ్యం కానున్నాయి. 'ప్రాణం' కమలాకర్ ఈ చిత్రానికి రీ-రికార్డింగ్ చేస్తుండడం గమనార్హం.  హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ ధియేటర్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో హీరో రాజీవ్‌ తండ్రి, మరియు ప్రముఖ సంగీత దర్శకులు కోటి, ప్రముఖ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్‌, ప్రముఖ నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్‌ (గోపి), రాజ్‌ కందుకూరి, మధుర ఆడియో అధినేత-ప్రముఖ దర్శకనిర్మాత మధుర శ్రీధర్‌, అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు అందుకొన్న ‘మిణుగురులు' దర్శకనిర్మాత అయోధ్యకుమార్‌, సెన్సార్‌బోర్డ్‌ మెంబర్‌ భాస్కర్‌ తదితరులతోపాటు చిత్ర బృందం పెద్ద సంఖ్యలో పాలుపంచుకొన్నారు. ఎ.కోదండరామిరెడ్డి బిగ్‌ సిడిని లాంచ్‌ చేయగా.. ఆడియో సిడిలను బి.గోపాల్‌ విడుదల చేసి.. తొలి ప్రతిని కోటికి అందించారు. దీనికి ముందు..  ట్రయిలర్‌ను బెక్కెం వేణుగోపాల్‌ ఆవిష్కరించారు. 

Advertisement
CJ Advs

తను నిర్మించి, దర్శకత్వం వహించిన ‘మిణుగురులు' చిత్రానికి కో-డైరెక్టర్‌గా పని చేసి.. అంతా తానై.. ఆ సినిమా రూపకల్పనలో  తనకు సహకరించిన గోవింద్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న ‘ప్రేమంటే సులువు కాదురా' కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని... అతని ప్రతిభను ప్రత్యక్షంగా చూసినవాడిగా ఈ విషయం తాను  చెబుతున్నానని అయోధ్యకుమార్‌ అన్నారు. పాటలు చాలా బాగున్నాయని, కోటి తనయుడు రాజీవ్‌ నటిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోదండరామిరెడ్డి, బి.గోపాల్‌ ఆకాంక్షించారు. నందనరాజ్‌ సంగీతం, 'ప్రాణం' కమలాకర్ రీ రికార్డింగ్  ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని.. గోవింద్‌రెడ్డి కచ్చితంగా  చాలా పెద్ద దర్శకుడవుతాడని, తన కుమారుడు రాజీవ్ కి ఈ చిత్రం తప్పకుండా మంచి బ్రేక్ ఇస్తుందని కోటి అన్నారు. హీరో రాజీవ్‌ సహాయ సహకారాల  వల్లే  'ప్రేమంటే సులువు కాదురా' చిత్రాన్ని  అనుకున్నవిధంగా తెరకెక్కించగలిగామని చిత్ర దర్శకుడు  చందా గోవింద్‌రెడ్డి, నిర్మాత భవనాసి రాంప్రసాద్‌, సహనిర్మాతలు కొమారి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.  ఎన్నెన్నో గొప్ప పాటలు  చేసిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్  కోటిగారి అబ్బాయి సినిమాకి మ్యూజిక్‌ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సంగీత దర్శకుడు నందన్‌రాజ్‌ అన్నారు.  ఈ చిత్రం లో అన్ని పాటలూ రాసే అవకాశం లభించినందుకు కృష్ణ మాదినేని సంతోషం వ్యక్తం చేశారు. స్వతహా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన తాను 'ప్రేమంటే సులువు కాదురా' అనే టైటిల్ కు పడిపోయానని, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ కు చాలా షేడ్స్ ఉంటాయని,. దర్శకుడు గోవింద్ రెడ్డి ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని తీసారని చిత్ర కథానాయకుడు రాజీవ్ అన్నారు.  తమ 'మధుర ఆడియో' ద్వారా వస్తున్న మరో మంచి ఆల్బం అని మధుర శ్రీధర్ అన్నారు. పాటలు, ట్రయిలర్ చాలా బాగున్నాయని, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని బెక్కెం వేణుగోపాల్, రాజ్ కందుకూరి తదితరులు అభిలషించారు.

కాశీ విశ్వనాద్, మధుమణి, చమక్ చంద్ర, చలాకి చంటి, వైజాగ్ అప్పారావు, టార్జాన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చాయాగ్రహణం: సురేష్ రఘుట, కూర్పు: యస్.బి.ఉద్ధవ్, పాటలు: కృష్ణ మాదినేని, సంగీతం: నందన్ రాజ్, నేపధ్య సంగీతం: 'ప్రాణం' కమలాకర్, సహ నిర్మాతలు: కొమారి సుధాకర్ రెడ్డి-శ్రీపతి శ్రీరాములు, నిర్మాత: భవనాసి రాంప్రసాద్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: చందా గోవింద్ రెడ్డి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs