Advertisement
Google Ads BL

2016లో వచ్చే మొదటి సినిమా ఇదే..!


రామ్, కీర్తి సురేష్ జంటగా కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం 'నేను.. శైలజ'. కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2016 జనవరి 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం రీరికార్డింగ్ వర్క్ జరుగుతోంది. ఓ ప్రేమ కథకు ఫ్యామిలీ ఎమోషన్స్ ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. డైరెక్టర్ కిషోర్ స్టొరీ చెప్పగానే రామ్ కు ఇదొక డిఫరెంట్ ఫిలిం అవుతుందని సినిమా చేయడానికి రెడీ అయ్యాను. సుమారుగా సంవత్సరం పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే కథ గనుక 'నేను.. శైలజ' టైటిల్ సూట్ అవుతుందని సెలెక్ట్ చేశాం. ఈ నెల 12న ఆడియో విడుదల చేసి జనవరి 1, 2016న సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ కథ వైజాగ్ లో మొదలయ్యి వైజాగ్ లోనే ముగుస్తుంది. సినిమా పాటల్లో కూడా కథను నడిపే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

హీరో రామ్ మాట్లాడుతూ.. ''ఈ సంవత్సరం మూడు చిత్రాల్లో నటించాను. మొదట ఈ సినిమాకు 'హరి కథ' అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం కాని సినిమా చూసిన తరువాత 'నేను.. శైలజ' టైటిల్ యాప్ట్ అవుతుందని సెలెక్ట్ చేసుకున్నాం. 55 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. అవుట్ పుట్ చూసాక చాలా తృప్తిగా అనిపించింది. ఈ చిత్రంలో నైట్ క్లబ్ లో పని చేసే ఓ డి.జె పాత్ర పోషించాను. సాఫ్ట్ గా కనిపించే పాత్ర అయినా.. మాస్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఆడియన్స్  నా నుండి ఎక్స్పెక్ట్ చేయని సినిమా అవుతుంది'' అని చెప్పారు.

డైరెక్టర్ కిషోర్ మాట్లాడుతూ.. ''నా లైఫ్ లో జరిగిన ఓ సంఘటనను తీసుకొని కథగా మలిచాను. సినిమాలో ప్రతి సంఘటన చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇదొక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి టీం కుదరడంతో సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేశాం. రామ్, రవికిషోర్ గారు చాలా ఫ్రీడం ఇచ్చారు. ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రమిది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, భాస్కర్ భట్ల, అనంత శ్రీరాం, సాగర్,  కోరియోగ్రఫీ: శంకర్, దినేష్, ప్రేమ రక్షిత్, రఘు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, హరి దినేష్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: స్రవంతి రవికిషోర్, రచన,దర్శకత్వం: కిషోర్ తిరుమల.    

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs