Advertisement
Google Ads BL

రెడీ ఫర్ రిలీజ్ 'బంగారు పాదం'!


దయా, జ్యోతిశ్రీ ప్రధాన పాత్రల్లో ఎన్.హెచ్.ప్రసాద్ దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'బంగారు పాదం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

దర్శకనిర్మాత ఎన్.హెచ్.ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. వస్తువులకు, మనుషులకు ఉన్న సంబంధాలను ఈ సినిమాలో చూపించాం. కాలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి ఒంటరిగా తన జీవితాన్ని ఎలా గడిపాడనేదే ఈ సినిమా కథ. వినోదంతో పాటు సీరియస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. తెలుగు సినిమాకు కొత్తదనాన్ని పరిచయం చేసే సినిమా ఇది. డిశంబర్ 4న 30 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ జోశ్యభట్ల మాట్లాడుతూ.. ''మిణుగురులు చిత్రం తరువాత ఆ తరహాలో ఉండే ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాను. వస్తువుల మీద ఉండే వ్యామోహాన్ని తగ్గించుకొని మానవ సంబంధాలకు కాపాడుకోవాలనే అంశాన్ని కళాత్మకంగా చూపించారు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఎడిటర్: శ్రీను బాబు, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయిర్, మ్యూజిక్ డైరెక్టర్: జోశ్యభట్ల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రవి కుమార్, కథ-మాటలు-దర్శకత్వం-నిర్మాత: ఎన్.హెచ్.ప్రసాద్.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs