Advertisement

'మామ మంచు..అల్లుడు కంచు'పాటలు విడుదల!


కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం 'మామ మంచు..అల్లుడు కంచు'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోన్ జరిగింది. టి.సుబ్బిరామిరెడ్డి ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని దానం నాగేందర్‌కు అందించారు. ఈ సందర్భంగా..

Advertisement

మోహన్ బాబు మాట్లాడుతూ.. ''మరాఠీ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయమని ఈ చిత్రానికి కో డైరెక్టర్‌ గా పని చేసిన రవి మాకు చెప్పారు. దాన్ని తెలుగు ప్రేక్షకులకు నచ్చే రీతిలో దర్శకుడు శ్రీనివాస్ అధ్బుతంగా తెరకెక్కించాడు. చాలా కాలం తరువాత మంచి టీం తో కలిసి వర్క్ చేసాను. ఈ సినిమా క్రెడిట్ అంతా.. దర్శకుడికే చెందుతుంది. ఇది అల్లరి నరేష్ కు యాభైవ సినిమా. నరేష్ నాకు అల్లుడి పాత్రలో నటించాడు. తన కామెడీ టైమింగ్ సూపర్. కోటి మ్యూజిక్ ఎంత బాగా కంపోజ్ చేస్తాడో అందరికి తెలుసు. రఘును ఒక పాట కంపోజ్ చేయమని ప్రత్యేకంగా అడిగాను. అచ్చు, కోటి, రఘులు ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ అందించారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు'' అని చెప్పారు.

టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ''మోహన్ బాబు స్వయంకృషి తో ఎదిగాడు. 550కి పైగా చిత్రాల్లో నటించి 60 సినిమాలను నిర్మించాడు. తన ముగ్గురు పిల్లల్ని చక్కగా పెంచాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోహన్ బాబు ఫ్యామిలీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

అంబరీష్‌ మాట్లాడుతూ.. ''మోహన్ బాబు తో నాకు మూడున్నర దశాబ్దాలుగా మంచి స్నేహం ఉంది. తను నటిస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

మంచు విష్ణు మాట్లాడుతూ.. ''ఈ సినిమా తెరకెక్కడానికి ముఖ్య కారణం కో డైరెక్టర్ రవి గారే. ఈ సినిమా కథ వినగానే నాన్నగారికి సూట్ అవుతుందని ఆయనకీ వినిపించాను. నరేష్ పాత్రలో నేను నటించాల్సింది కాని నేను అల్లుడి పాత్రలో నటిస్తే నాన్నగారు మామ పాత్ర పోషించలేరు. అప్పుడు నరేష్ తో ఆ పాత్ర చేయించాలనుకున్నాం. అతని కామెడి టైమింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఓ నిర్మాతగా నరేష్‌ 50వ సినిమాను ప్రొడ్యూస్‌ చేసినందుకు హానర్‌గా ఫీలవుతున్నాను. ఈ చిత్రం 'అల్లరి మొగుడు' పార్ట్ 2లా అనిపిస్తుంది. నాన్నగారికి జోడీగా రమ్యకృష్ణ, మీనా లు నటించారు. బ్రహ్మానందం గారి డేట్స్ దొరకకపోవడంతో అలీ గారిని ఎన్నుకున్నాం.23 సంవత్సరాల తరువాత వస్తోన్న ఈ కాంబినేషన్ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఇదొక కుటంబ కథా చిత్రం. చాలా ఎంజాయ్ చేస్తూ.. చిత్రీకరించాం. మోహన్‌బాబుగారితో పనిచేయడం మరచిపోలేని అనుభూతి. మోహన్ బాబు గారు నలభై సంవత్సరాల నట జీవితం పూర్తి చేసుకున్న తరువాత చేస్తున్న సినిమా అలానే నరేష్ కు 50 వ సినిమా అయిన ఈ చిత్రాన్ని నేను డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. 'అల్లరి మొగుడు' కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మోహన్ బాబు గారు, అల్లరి నరేష్ పోటీపడి నటించారు. మంచి మ్యూజిక్ కుదిరింది. క్వాలిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది'' అని చెప్పారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ''మోహన్ బాబు గారి సినిమాలు చూస్తూ.. పెరిగాను. ఆయనతో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. లాగే నా ఫేవరేట్‌ హీరోయిన్స్‌ రమ్యకృష్ణ, మీనాగారితో కూడా కలిసి నటించే అవకాశం కలిగింది. ఇది నేను నటించిన 50వ సినిమా. కెరీర్‌ స్టార్టింగ్‌లో కనీసం ప్రేక్షకులు 5 సినిమాలైనా ఆదరిస్తారా అని ఆలోచించాను. కానీ ఇప్పుడు 50 సినిమాలు చేశాను. ఈ సక్సెస్‌ఫుల్‌ జర్నీకి ముందుగా నాన్నగారికి థాంక్స్‌ చెప్పుకోవాలి. తర్వాత నాతో పాటు వర్క్‌ చేసిన దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్‌కు థాంక్స్‌'' అని అన్నారు.   

ఇంకా ఈ కార్యక్రమంలో రమ్యకృష్ణ, లక్ష్మీ ప్రసన్న, సుమలత, మంచు మనోజ్‌, మీనా, బ్రహ్మానందం, అలీ, వరుణ్‌ సందేశ్‌, శ్రీమణి, శ్రీధర్‌ సీపాన తదితరులు పాల్గొన్నారు. 

హృదయ, వరుణ్‌ సందేశ్‌, అలీ, కృష్ణభగవాన్‌, రాజారవీంద్ర, నాగూర్‌బాబు, సోనియా, సురేఖావాణి, అంజన, మౌనిక, ధన్‌రాజ్‌, చమ్మక్‌చంద్ర, ఖయ్యూమ్‌, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్‌, సత్తెన్న, దాసన్న, అంబటి శీను తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్‌ సీపాన, పాటలు: శ్రీమణి, అనంత్‌ శ్రీరామ్‌, డ్యాన్స్‌: రాజు సుందరం, శ్రీధర్‌, విద్యాసాగర్‌, ఆర్ట్‌: చిన్నా, ఎడిటర్‌: గౌతంరాజు, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: బి.బాలమురుగన్‌, సంగీతం: కోటి, అచ్చు, రఘుకుంచె, నేపథ్య సంగీతం: కోటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రెడ్డి విజయ్‌కుమార్‌, నిర్మాత: విష్ణు మంచు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌: శ్రీనివాస్‌రెడ్డి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement