ప్రకాష్‌రాజ్‌లో ఎంత మంచి నటుడున్నాడో... ఆయనలో అంత మంచి దర్శకుడున్నాడు. ఆయన చేసిన సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయుండొచ్చు కానీ... ప్రేక్షకుల మనసుల్ని మాత్రం హత్తుకొన్నాయి. ధోని, ఉలవచారు బిర్యానీ చిత్రాలు ప్రకాష్‌రాజ్‌లోని దర్శకత్వ ప్రతిభని బయటపెడతాయి. ప్రతీసారీ మంచి కథని చెప్పాలని ప్రయత్నిస్తుంటాడు. తాజాగా ఆయన మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. `మన ఊరి రామాయణం` పేరుతో ఆ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ఈ చిత్రాన్ని కూడా ఉలవచారు బిర్యానీలాగే తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కొత్తవాళ్లతో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఊళ్లల్లో చోటు చేసుకొనే సంఘటనలకి అద్దం పట్టేలా ఉంటుందట. ఇటీవల ప్రకాష్‌రాజ్ మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ ఊరును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నాడు. ఆ పనుల్లో వున్నప్పుడు తట్టిన కథతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో కలిసి నిర్మించబోతున్నట్టు తెలిసింది. మరి ఈ చిత్రంతోనైనా ప్రకాష్‌రాజ్ డబ్బులు సంపాదిస్తాడేమో చూడాలి.
Advertisement
CJ Advs