Advertisement
Google Ads BL

ఇదేం ఆట కమల్ హాసనూ!


నటీనటులకు వయసుతో నిమిత్తం లేదు అని చెప్పడానికి కమల్ హాసన్ ఓ చక్కటి నిదర్శనం. ఎటువంటి పాత్రనిచ్చినా పరకాయ ప్రవేశం చేసి దాని అంతు తేల్చి పారేస్తాడు. చీకటి రాజ్యంలో కొడుకు ప్రాణాల కోసం తపన పడే పోలీసాఫీసరుగా ఈయన నటన మరోసారి అందరినీ ఆకర్షించింది, పైగా చాన్నాళ్ళ తరువాత ఇది కమల్ చేసిన డైరెక్ట్ తెలుగు సినిమా కావడంతో ప్రేక్షకులు ఆదరించడానికి రెడీ అయిపోయారు. ఓ వైపు విశ్వరూపం 2 విడుదల కోసం పోరాటం సాగిస్తూనే కమల్ మాత్రం చకచకా తన తదుపరి ప్రాజెక్టు మీదకి దూకేసాడు. అక్కినేని అమల కథానాయికగా కమల్ హీరోగా రూపొందబోతున్న ఓ క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ ఫిలింగా అమ్మ నాన్న ఆట అనే పేరు కూడా పెట్టేసారు. అప్పట్లో అమల గారితో పుష్పక విమానం, సత్యా, వెట్రి విజా లాంటి సినిమాలు చేసిన తరువాత మళ్ళీ కమల్ ఇలా అక్కినేని అమ్మగారితో కలిసి పని చేయడం హర్షించదగ్గ పరిణామం. ఈ అమ్మా నాన్న ఆట సినిమాను వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదలకు కమల్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs