ఒక వైపు కమల్ హసన్, మరో వైపు తలా అజిత్. రెండు భీకర స్టార్ హీరోల మధ్య ఒక తూఫాను దూసుకొచ్చింది. కమల్ హీరోగా రూపొందిన తూంగవనం, అజిత్ హీరోగా వేదాలం, రెండూ ఒకే రోజు దీపావళి కానుకగా తమిళనాడులో విడుదలయ్యాయి. విశేషం ఏమిటంటే రెండింటికీ సూపర్బ్ హిట్ టాక్ వచ్చింది, అలాగే అనుకున్నదానికంటే రెంటికీ భీకరమైన ఓపెనింగ్స్ వచ్చాయి. విధి వక్రిస్తే ఎంతవాడైనా తలోంచాల్సిందే అన్నట్టుగా ఈ సినిమాల విజయదుందుభి రెండు మూడు రోజులు వరకు కూడా సాగలేదు. అకస్మాత్తుగా వచ్చిన తూఫాను వరదతో మొత్తం సర్వనాశనం అయింది. చెన్నై పట్టణం అంతా నీట మునిగింది. చెన్నై చుట్టుపక్కల పట్టణాలలో కూడా సినిమా షోలు ఆగిపోయాయి. ఇంకొన్ని చోట్ల సినిమాల ప్రదర్శనను పూర్తిగా నిలిపివేశారు. దీనితో బాక్సాఫీస్ బద్దలవుద్ది అనుకున్న చోట రెండు సినిమాలు చతికిల పడ్డాయి. అజిత్, కమల్ హాసన్... ఇద్దరూ ఇద్దరే. కానీ వరుణుడి ముందు రెండు సినిమాలు బేజారేత్తాయి.