Advertisement
Google Ads BL

'నాన్నకు ప్రేమతో' నైజాంలో ఫినిష్..!


యంగ్‌టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తోన్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఇందులో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. సినిమాను అనుకున్న తేదీకి అంటే జనవరి 8వ తేదీకి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నైజాం రైట్స్‌ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌తో కలిసి రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. నైజాం ఏరియా బిజినెస్‌ పూర్తికావడంతో ఇప్పుడు అన్ని ఏరియాల నుండి బిజినెస్‌ ఆఫర్స్‌ వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఫ్యాన్సీ ఆఫర్స్‌తో ఈ చిత్రం హక్కులను పొందడానికి పోటీపడుతున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs