Advertisement
Google Ads BL

సూర్య ఆవిష్కరించిన 'మేము' ఆడియో!


సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ పాండిరాజ్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న 'పసంగ-2' చిత్రాన్ని తెలుగులో 'మేము' పేరుతో విడుదల చేస్తున్నారు. సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సూర్య, కె.ఇ.జ్ఞాన్‌వేల్‌ రాజా ఈ చిత్రాన్ని తెలుగులో సంయుక్తంగా సమర్పిస్తున్నారు. అమలాపాల్‌, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్రోల్‌ కొర్రెల్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. హీరో సూర్య బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. వీరుపోట్ల థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

హీరో సూర్య మాట్లాడుతూ.. ''మా బ్యానర్ లో నిర్మించిన మొదటి చిత్రమిది. కాని ముందుగా జ్యోతిక నటించిన సినిమా రిలీజ్ అయింది. పాండిరాజ్ రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పిల్లలకు వారి బాల్యం చాలా ముఖ్యమైనది. పిల్లల ఇష్టాన్ని పెద్దలు గౌరవించాలనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. అర్రోల్‌ కొర్రెల్‌ మంచి మ్యూజిక్ డైరెక్టర్. తను చార్టెడ్ అకౌంటెంట్ అయినా.. ప్యాషన్ తో మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు పాండిరాజ్ మాట్లాడుతూ.. ''తమిల్ లో ఇది నా అయిదవ చిత్రం. తెలుగులో మొదటిది. ఇంత గ్రాండ్ గా లాంచ్ చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు. 'మేము' ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. ''ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కష్టపడి వర్క్ చేసారు. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ''అందరూ చూడగలిగే మంచి కుటుంబ కథా చిత్రం. ప్రేక్షకులు సూపర్ హిట్ చేయాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

అమలాపాల్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో మంచి పాత్రలో నటించే అవకాసం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. సూర్య గారితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాను'' అని చెప్పారు.

వీరుపోట్ల మాట్లాడుతూ.. ''ఒకసారి చెన్నైలో షూటింగ్ కి వెళ్ళినప్పుడు అనర్గళంగా రెండు పేజీల డైలాగ్స్ చెప్పిన శివకుమార్ గారిని చూసి ఆశ్చర్యపోయాను. వారికి ఉన్న డెడికేషన్, క్రమశిక్షణ ఈ తరం వాళ్లకు ఉంటే మంచి పోజిషన్స్ కు వస్తారని దర్శకుడు మౌళి చెప్పారు. శివకుమార్ గారి కుమారులు సూర్య, కార్తి లు అధ్బుతంగా నటిస్తారు. డబ్బింగ్ సినిమాల్లా అసలు అనిపించవు. తెలుగు చిత్రమనే అనిపిస్తుంది. పాండిరాజ్ గారు ఆలోచనలు చాలా ఇన్నోవేటివ్ గా ఉంటాయి. ఈ సినిమా ట్రైలర్ కూడా కొత్తగా ఉంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.

ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ''మా ప్రాంత వ్యక్తి మధుసూదన్ రెడ్డి సూర్య చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి హిట్ కావాలి. సూర్య ఇలాంటి పెద్ద చిత్రాలు మరిన్ని చేయాలి'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శివ కృష్ణారెడ్డి, శ్రీకాంతయ్య, గిరి, సుబ్బయ్య, మల్టీ డైమెన్షన్ వాసు, రాధామోహన్, నరేంద్రరాజు, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. 

శశాంక్‌ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్‌ కె.యల్‌, సాహిత్యం: వెన్నెలకంటి-చంద్రబోస్‌-సాహితి-సంగీతం: అర్రోల్‌ కొర్రెల్‌, సమర్పణ: సూపర్‌స్టార్‌ సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs