మాస్ మహరాజ రవితేజ కథానాయకుడిగా, తమన్నా, రాశిఖన్నాలు కథానాయికలుగా, సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్న చిత్రం బెంగాల్ టైగర్. కె.కె రాధామోహన్ నిర్మాత. ఈ చిత్రంలో రెండు వీడియో పాటలను సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా..
దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. ''ఇటీవల విడుదల చేసిన ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని ఎఫ్.ఎం స్టేషన్స్ లో ఈ సినిమా పాటలు కంటిన్యూస్ గా వినపడుతూనే ఉన్నాయి. భీమ్స్ అందించిన సంగీతానికి అశోక్ తేజ, భాస్కర్ భట్ల, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణిల సాహిత్యం, జాని మాస్టర్ కోరియోగ్రఫీ ప్లస్ అయింది. తమన్నా, రాశిఖన్నాలు పోటీపడి నటించారు. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం'' అని చెప్పారు.
నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. ''భీమ్స్ మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందులో క్రెడిట్ సంపత్ నంది కి కూడా చెందుతుంది. ఎందుకంటే ఆయన ఈ సినిమాను డైరెక్ట్ చేయడమే కాదు ఒక పాట కూడా రాసారు. ఈ నెల 26 లేదా 27న సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్సు చేస్తాం. 'బెంగాల్ టైగర్' చిత్రం వాయిదా పడడానికి కారణం 'అఖిల్' సినిమానే అని బయట పుకార్లు వినిపిస్తున్నాయి. నిజానికి 'బెంగాల్ టైగర్','అఖిల్' సినిమాల డిస్ట్రిబ్యూటర్ ఒక్కరే కావడంతో రెండు సినిమాలు క్లాష్ అవ్వకుండా ఇండస్ట్రీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మా చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసాం. అంతేకాని 'అఖిల్' మాత్రం కారణం కాదు. అవన్నీ రూమర్స్ మాత్రమే'' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. ''ఇది నా ఆరవ సినిమా. అన్ని ఆడియోలు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ కొడతాననే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
తమన్నా మాట్లాడుతూ.. ''రాధామోహన్ గారు సినిమాను కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసి చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. సంపత్ గారు సినిమాలో పాటలు బావుండాలని చాలా కేర్ తీసుకొని చేసారు. కమర్షియల్ సాంగ్ షూట్ చేసినప్పుడు పార్టీ లాగా ఎంజాయ్ చేసాం. భీమ్స్ రాకింగ్ మ్యూజిక్ ఇచ్చాడు'' అని చెప్పారు.
రాశిఖన్నా మాట్లాడుతూ.. ''భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో ఉన్న కమర్షియల్ సాంగ్ నాకు చాలా స్పెషల్. తమన్నా నాకు కొన్ని విషయాల్లో హెల్ప్ చేసింది. ఈ సినిమాలో నాకు అవకాసం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్, సుద్దాల అశోక్ తేజ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రలో మాస్‌మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్ ఇరాని, బ్రహ్మనందం, రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, హర్హవర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు నటించగా..
బ్యానర్ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్, కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి,వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం భీమ్స్, నిర్మాత: కె.కె.రాధామెహన్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే -దర్శకత్వం: సంపత్ నంది.