శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్న సినిమా 'గల్ఫ్'. ఈ సినిమా విశేషాలు తెలిపేందుకు చిత్రబృందం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..
సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''గల్ఫ్ లో ఉండే చాలా మంది నిజ జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ఇటీవలే రిలీజ్ చేసిన గల్ఫ్ ప్రమోషనల్ సాంగ్ ను రెండున్నర లక్షల మంది వీక్షించారు. ఈ సినిమా కథ కోసం సుమారుగా నాలుగు దేశాలు తిరిగాను. అక్కడున్న ప్రజలతో మాట్లాడి వారి జీవితాల గురించి తెలుసుకున్నాను. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గల్ఫ్ క్వార్టర్స్ లో చర్చలు నిర్వహించాం. ఈ చిత్రానికి సంబంధించి వలస కార్మిక సంఘం అధ్యక్షుడు భీమ్ రెడ్డి గారు ఎన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు. ఒక షెడ్యూల్ పూర్తి చేసాం. డిసెంబర్ నుండి రెండో షెడ్యూల్ మొదలు పెట్టి ఫిబ్రవరి నెలకు సినిమా షూటింగ్ పూర్తి చేస్తాం. దుబాయ్, ఉమాన్, సిరిసిల్ల, కడప తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తాం. ఇదొక థ్రిల్లింగ్ లవ్ స్టొరీ. సినిమాలో మొత్తం నాలుగు పాటలుంటాయి. మంచి స్క్రీన్ ప్లే తో సినిమా రన్ అవుతుంటుంది'' అని చెప్పారు.
నిర్మాత రవీంద్ర బాబు మాట్లాడుతూ.. ''సునీల్ కుమార్ అహర్నిశలు కష్టపడి సినిమా చేస్తున్నాడు. ఎన్నో దేశాలు తిరిగి కథ సిద్ధం చేసుకున్నాడు. ఒక షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసి సమ్మర్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
భీమ్ రెడ్డి మాట్లాడుతూ.. ''వలస కార్మిక సంఘానికి నేను అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. గల్ఫ్ పేరుతో సినిమా చేయడం మంచి ప్రయత్నమని నేను భావిస్తున్నాను. కంప్లీట్ సోషల్ ఇష్ష్యూతో వస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి. గల్ఫ్ కు ఒంటరిగా వెళ్ళే వారి జీవితాలను ఎమోషనల్ గా పిక్చరైజ్ చేయడం అభినందించాల్సిన విషయం'' అని చెప్పారు.
అనురాధ మాట్లాడుతూ.. ''నేను దుబాయ్ లో లాయర్ గా పని చేస్తున్నాను. గల్ఫ్ కు వలస వచ్చే వారికి సలహాలు, సూచనలు ఇస్తూ.. ఉంటాను. సునీల్ గారు ఈ సినిమా కోసం గల్ఫ్ లో పని చేసే కార్మికులతో మమేకమై వారి జీవితాల గురించి తెలుసుకున్నారు. ఈ సినిమాలో నాకొక మంచి పాత్రలో నటించే అవకాసం ఇచ్చారు. నా పాత్ర ద్వారా ప్రేక్షకులకు మెసేజ్ రీచ్ అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బసంత్ రెడ్డి, ఎల్.ఎన్.రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.వి.శివరాం, మ్యూజిక్ డైరెక్టర్: ప్రవీణ్ ఇమ్మడి, లిరిక్స్: కాసర్ల శ్యాం, సిరాశ్రీ, మాస్టర్ జీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.బాపిరాజు, కో ప్రొడ్యూసర్స్: ఎల్.ఎన్.రావు, కుర్ర విజయ్ కుమార్, ప్రొడ్యూసర్: యెక్కలి రవీంద్రబాబు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి.
Advertisement
CJ Advs