సుధీర్ బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్ కుమార్, శశిధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రం టీజర్ ను శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా..
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ''ఇది ఒక రోజులో జరిగే కథ. హీరో తను అనుకున్న ప్లాన్ తో మొదలు పెట్టిన ఆ రోజు తనని ఎక్కడకి దారి తీసింది, తను ఎవరెవరిని కలిసాడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడనేదే ఈ సినిమా కథ. దానికి వినోదాన్ని జోడించి చిత్రీకరించాం. సుధీర్ బాబుతో కలిసి వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. హీరోయిన్ వామిక ఓ తమిళ చిత్రంలో నటించింది. తెలుగులో తనకు మొదటి సినిమా. బాగా నటించింది'' అని చెప్పారు.
నిర్మాత విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ''నేను నా ఫ్రెండ్ శశి కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. శ్రీరామ్ ఈ చిత్రాన్ని బాగా డైరెక్ట్ చేసాడు. సుధీర్ నేను మంచి ఫ్రెండ్స్'' అని చెప్పారు.
సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''నా కెరీర్ మొదటి నుండి ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ.. వచ్చాను. ఇది కూడా ఒక డిఫరెంట్ జోనర్ కు చెందిన చిత్రం. శ్రీరామ్ ఎవరి దగ్గరా పని చేయలేదు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసాడు. తన ఆలోచనలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వామిక, వేణు, శ్యాందత్, రామ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: సన్నీ ఎం.ఆర్, ఆర్ట్ డైరెక్టర్: రామ కృష్ణ, డైలాగ్స్: అర్జున్, కార్తిక్, కో డైరెక్టర్: శ్రీరామ్ ఎరగంరెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.టి.