Advertisement
Google Ads BL

అమెరికాలో కీరవాణి అండ్ టీమ్ సందడి..!


సథరన్ కాన్సెప్ట్స్, ఐ ఎన్ సి సంస్థ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మెలోడీ కింగ్ కీరవాణి చేత ప్రదర్శనలు ఇప్పించనున్నారు. సంక్రాంతి కానుకగా అమెరికా లో ఉండే తెలుగు వారిని అలరించడానికి కీరవాణి అండ్ టీం జనవరి 13, 2016 నుండి జవరి 30, 2016 వరకు అమెరికాలో వారి పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ ''గతంలో రెండు సార్లు న్యాట్స్ సంస్థ ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్లి ప్రదర్శనలిచ్చాము. అక్కడున్న తెలుగు వారిని కలుసుకొని వారి ఇష్టాలను తెలుసుకొని పాటలు పాడి వారిని అలరించాము. అదే విధంగా ఈ సారి సథరన్ కాన్సెప్ట్స్, ఐ ఎన్ సి సంస్థ ఆహ్వానం మేరకు జనవరిలో  అమెరికా వెళ్ళనున్నాం. కొత్త పాటలను, పాత పాటలను మిక్స్ చేసి పాడనున్నాం. మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తాం. ఇనగంటి సుందర్ బాహుబలి సినిమాలో మూడు పాటలు రాసారు. మ్యూజికల్ నైట్స్ లో తమకు ఇష్టమైన పాటను వినడానికి ప్రేక్షకులు ఇనగంటి సుందర్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తే ఆ పాటను వినిపించడానికి ప్రయత్నిస్తాము. నేను కంపోజ్ చేసిన పాటలతో పాటు చక్రవర్తి, ఇళయరాజా వంటి వారు కంపోజ్ చేసిన పాటలు కూడా వినిపిస్తాము'' అని చెప్పారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs