Advertisement
Google Ads BL

నిర్భయ చేయనిది కీచకుడు చేస్తాడట!


యామిని భాస్కర్‌, జ్వాల కోటి, ప్రధాన పాత్రల్లో గౌతమి టాకీస్‌ పతాకంపై ఎన్‌.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిశోర్‌కుమార్‌ పర్వతరెడ్డి నిర్మిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ కీచక. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందుగానే సినిమాకు సంబంధించిన కొన్ని  వీడియోస్ లీక్ అయ్యాయి. ఆ వీడియోలు చూడడానికి అసభ్యకరంగా ఉండడంతో మహిళా సంఘాలు చిత్రబృందం పై దాడికి దిగాయి. దీనిపై స్పందించిన సినిమా టీం గురువారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

ఎన్.వి.బి.చౌదరి మాట్లాడుతూ.. ఇదొక చిన్న సినిమా. తెలుగు చిత్రాల్లో విభిన్నమైనది. సినిమా స్కేల్ చిన్నదైనా.. కాన్వాస్ చాలా పెద్దది. ఓ బర్నింగ్ ఇష్యూ ను తీసుకొని కొంతమందికి హెచ్చరికలా ఉండేలా సినిమా చేసాం. సినిమా వల్గారిటీగా ఉండదు కాని హార్ష్ గా, వయిలెంట్ గా ఉంటుంది. కొంతమందిని టార్గెట్ చేస్తూ చేసిన సినిమా. ఆడవాళ్ళను ఇన్స్పైర్ చేయడం కోసమే చేసాం. సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోలు చూసి మహిళా సంఘాలు మాపై దాడికి దిగాయి. వాళ్ళని సపోర్ట్ చేస్తూ మేము సినిమా చూసాం. కేవలం కొన్ని సన్నివేశాలు చూసి సినిమాను జడ్జ్ చేయడం సబవు కాదు. సెన్సార్ వారి నుండి కూడా మంచి స్పందనే వచ్చింది. 60 సెకన్లు సీన్లను, 5, 6 సన్నివేశాల్లో వాయిస్ కట్ చేసి అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా ఉపన్యాసమో.. సందేసమో.. ఇవ్వలేదు. ఒక వార్నింగ్ ఇస్తున్నాం. నాగపూర్ లో జరిగిన యదార్థ సంఘటన తీసుకొని ఫిక్షన్ జోడించి కథను సిద్ధం చేసుకున్నాను. నాగపూర్ వెళ్లి మూడు నెలలు పరిశోధన చేసాను.. అని చెప్పారు.

కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని 100 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. ఎక్కడైతే మహిళల అత్యాచారాలు జరుగుతున్నాయో.. అక్కడ మహిళలంతా ఒక్కటై ఎదిరిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాం. మహిళలను హింసించే విధంగా సినిమా చేయలేదు. వాళ్ళను ప్రోత్సహించే విధంగానే సినిమా ఉంటుంది.. అని చెప్పారు.

జ్యోస్య భట్ల మాట్లాడుతూ.. దండుపాల్యం సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తారు. అందులో ఉన్న 5 శాతం కూడా ఈ చిత్రంలో ఉండదు. నిర్భయ చట్టం అరికట్టలేని అత్యచారాలని  మా కీచక అరికడుతుందనే నమ్మకం ఉంది.. అని చెప్పారు.

జ్వాల కోటి మాట్లాడుతూ. ఇది సృష్టించిన కథ కాదు. వాస్తవికంగా జరిగిన కథను ఓ క్లారిటీ తో డైరెక్టర్ గారు తెరకెక్కించారు. అందరు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో యామిని భాస్కర్, ఎన్.వి. రావు తదితరులు పాల్గొన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs