జి.వి.ప్రకాష్ కుమార్, ఆనందిని, మనీషా యాదవ్ ప్రధాన పాత్రల్లో రుషి మీడియా బ్యానర్ పై స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా సారధ్యంలో ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కృష్ణ, రమేష్ నిర్మాతలుగా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రం త్రిష లేదా నయనతార. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బెక్కం వేణుగోపాల్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను నిర్మాత శోభారాణి కి అందించారు. ఈ సందర్భంగా..
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. తమిళంలో ఇటీవల విడుదలయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. కథను నమ్ముకొని ఓ యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో కూడా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తమిళంలోలానే తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
శోభారాణి మాట్లాడుతూ.. జి.వి. సాంగ్స్ లో చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. యూత్ ఫుల్ లవ్ స్టొరీ ఇది. తెలుగులో కూడా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.
అయోధ్య కుమార్ మాట్లాడుతూ.. సాంగ్స్ అన్ని హైవోల్టేజీ తో ఉన్నాయి. జి.వి లో చాలా ఎనర్జీ ఉంది. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
నిర్మాత సి.జె.జయకుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 న తమిళంలో ఈ సినిమాను రిలీజ్ చేసాం. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు తగ్గట్లుగా ఈ చిత్రముంటుంది. యూత్ ఆడియన్స్ కు మంచి ట్రీట్ అవుతుంది.. అని చెప్పారు.
సాయి కార్తిక్ మాట్లాడుతూ.. ఓ మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా మారిన మొదటి వ్యక్తి జి.వి గారే. ఆయన తమిల్ మూవీ డార్లింగ్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆయనకు అభిమానిని. ఇదొక కమర్షియల్ సినిమా. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.
ఆనందిని మాట్లాడుతూ.. ఇదొక బోల్డ్ ఫిలిం. యూత్ అందరికి నచ్చుతుంది. తమిళంలో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
జి.వి.ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. తమిళంలో ఇది నా రెండో సినిమా. తెలుగులో మొదటి సినిమా. తెలుగులో రెండు పాటలు నేనే పాడాను. ఇదొక లోకల్ ఫిలిం. సినిమాలో జీవా అనే పాత్ర పోషించాను. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.. అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, వెన్నెలకంటి, శ్రీమణి, రాఖీ, సంభాషణలు: శశాంక్ వెన్నెలకంటి, ఫోటోగ్రఫీ: రిచ్ద్ ఎమ్ నాదన్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఆదిక్ రవిచంద్రన్, నిర్మాతలు: కృష్ణ, రమేష్.