Advertisement
Google Ads BL

బాలయ్య ని రెచ్చగొడితే అంతే మరి..!


నీకు హిస్టరీలో బ్లడ్ ఉందేమో..నా బ్లడ్ కే ఓ హిస్టరీ ఉంది...

Advertisement
CJ Advs

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం..నాలాంటి వాడిని రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం...

ప్రస్తుతం ఈ డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. కారణం ఈ డైలాగ్స్ చెప్పింది నటసింహ నందమూరి బాలకృష్ణ, ఈ డైలాగ్స్ ఆయనలోని పవర్ ను తెలియజేస్తున్నాయి. ఇవి రీసెంట్ గా రిలీజ్ అయిన డిక్టేటర్ టీజర్ లోనివే...

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతి పెద్ద నిర్మాణ సంస్థగా పేరు పొందిన ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ తో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్. లౌక్యం వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అందించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రచయితలు కోనవెంటక్, గోపిమోహన్ లు ఈ చిత్రానికి రచయితలుగా వర్క్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈరోస్ ఇంటర్నేషనల్ సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం సినిమా రెమడా హోటల్ లో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమా టీజర్ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా 10గంటల 17 నిమిషాలకు విడుదలైంది. ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు అంజలి, సుమన్, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, పవిత్రా లోకేష్, ఆనంద్, మధు, పద్మావతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా...

నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. శ్రీవాస్ సినిమాను చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజ్ సంస్థతో కలిసి పనిచేయడం హ్యపీగా ఉంది.  కథ విషయంలో నేను హండ్రెడ్‌ పర్సెంట్‌ కొత్తదన్నాన్ని ఫీలవుతున్నాను. కోనవెంకట్‌, గోపిమోహన్‌లు అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న మంచి కథను అందించారు. రత్నం, శ్రీధర్‌ సీపానలు కూడా ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఈ సినిమాకి ఒక ఫ్రెష్‌ టీమ్‌తో కలిసి పనిచేస్తున్నాను. ఫస్ట్ లుక్ ,గణేష్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా రోజున రాజధాని అమరావతి శంకు స్థాపన జరిగింది. ఆ మరుసటి రోజునే డిక్టేటర్ టీజర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. టీజర్ చాలా బావుంది. ఒక ఫ్రెష్‌ ఫీల్‌ ఇస్తున్న సినిమా. యాక్షన్‌, ఫ్యామిలీ, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌  అన్నీ ఎలిమెంట్స్‌తో యూనిక్‌ కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ సినిమా తప్పకుండా నచ్చే చిత్రమవుతుంది.. అన్నారు.

ఈ సందర్భంగా ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఎగ్జయిట్ ఫేజ్ లో ఉంది. ఇక్కడ గొప్ప కథలు, రచయితలు, నటీనటులున్నారు. నందమూరి బాలకృష్ణ, శ్రీవాస్ ల కాంబినేష్ లో రూపొందుతోన్న ‘డిక్టేటర్’ లో పార్ట్ కావడం చాలా హ్యపీగా ఉంది. సినిమా చాలా బాగా వస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  దసరా కానుకగా డిక్టేటర్ టీజర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది.. అన్నారు.

డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం డిక్టేటర్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. రెమడా హోటల్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నాం. దసరా కానుగా ఈరోజు టీజర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. లోకేషన్ లో టీజర్ ను చూసి అందరూ బాగుందని మెచ్చుకున్నారు. ముఖ్యంగా బాలకృష్ణగారికి టీజర్ బాగా నచ్చింది. ఈరోస్ సంస్థ జర్నీలో డిక్టేటర్ హ్యుజ్ సక్సెస్ అయి పెద్ద మైల్ స్టోన్ మూవీ అవుతుంది. సినిమాను సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. మంచి కథ, గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందుతోన్న డిక్టేటర్ అభిమానులకు, అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుంది.. అన్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అంజలి, సోనాల్ చౌహాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రవికిషన్, షాయాజీ షిండే, నాజర్, పృథ్వి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయడు, డైలాగ్స్: ఎం.రత్నం, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs