రానాకి బోలెడుమంది కథానాయికలతో లింకులు పెడుతూ మాట్లాడుకొంటుంటారు ఫిల్మ్‌నగర్ జనాలు. అయితే మొట్టమొదట రానా గాళ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలోకి వచ్చింది మాత్రం శ్రియనే. వాళ్లిద్దరూ కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగారని చెబుతుంటారు. అయితే ఆ తర్వాత బిపాసా బసు, త్రిష... ఇలా పలువురు పేర్లని రానాతో ముడిపెడుతూ వినిపించారు. నిజంగా వాళ్లతో రానాకి ఎలాంటి సంబంధముందో ఎవ్వరికీ తెలియదు. కానీ... ఒకప్పుడు గర్ల్‌ఫ్రెండ్‌గా అందరి నోళ్లల్లో నానిన శ్రియ మాత్రం రానాకి భార్య అయిపోయింది. అవునా? ఎలా? అని ఆశ్చర్యపోకండి. అది వెండితెరపైనే. బాహుబలి 2లో రానా భార్యగా శ్రియ కనిపించబోతోందని సమాచారం. తొలి భాగంలో రానా తండ్రిని, కొడుకుని చూపించారు కానీ... భార్య పాత్రని మాత్రం చూపించలేదు. తండ్రిగా నాజర్, కొడుకుగా అడవిశేష్ కనిపించారు. అయితే భార్య పాత్ర రెండో భాగంలో ఉంటుందట. ఆ పాత్రకోసం శ్రియని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. బాహుబలి చిత్రంలో భల్లాలదేవగా నటించాడు రానా. రెండో పార్ట్‌లో ఆయన భార్యది కీ రోల్ అట. అందుకే ఆ పాత్రలో నటించే అవకాశం తనకు లభించడంతో శ్రియ ఎగిరి గంతేసిందట. అన్నట్టు శ్రియ రాజమౌళి దర్శకత్వంలో ఇదివరకు కూడా నటించింది. ప్రభాస్, శ్రియలతో రాజమౌళి ఇదివరకు ఛత్రపతి తీశాడు. అందులో చిట్టి నడుముతో శ్రియ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
Advertisement
CJ Advs