ఓంకార్ దర్శకత్వంలో దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదలవుతున్న రాజుగారి గది.
ఈగ, అందాల రాక్షసి, లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యాస వంటి హిట్ చిత్రాలను నిర్మించిన వారాహిచలన చిత్రం అధినేత సాయికొర్రపాటి, బిందాస్, యాక్షన్ 3డి, జేమ్స్ బాండ్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూస్ అనీల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ప్రై.లి. పతాకంపై రూపొందిన చిత్రం రాజుగారి గది. ఆశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణన్, చేతన్, ఈశాన్య, పూర్ణ ప్రధాన పాత్రధారులు. ఆర్.దివాకరన్, ప్రవీణ.ఎస్ లైన్ ప్రొడ్యూసర్స్. కళ్యాణ చక్రవర్తి ఎగ్జిక్టూటివ్ ప్రొడ్యూసర్. ఓంకార్ దర్శకుడు. ఈ సినిమాని దసరాకానుకగా అక్టోబర్ 22న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ..
దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. రాజుగారి గది పక్కా ప్రణాళికతో రూపొందిన హర్రర్ కామెడి చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. అనుకున్న టైమ్ లో, అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసిన చిత్రం ఇది. ఇటీవల విడుదల చేసిన లోగో, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని చూసి నచ్చడంతో ప్రముఖ నిర్మాతలు సాయికొర్రపాటిగారు, అనీల్ సుకంరగారు సమర్పకులుగా వ్యవహరించడం చాలా హ్యపీగా ఉంది. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల చేస్తున్నాం. భయం, హాస్యంతో పాటు పర్పస్ ఉన్న మూవీ. చాలా కష్టపడి చేశాం. డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడి ప్రేక్షకులకు తప్పకండా నచ్చుతుంది.. అన్నారు.
పోసాని కృష్ణమురళి, రఘుబాబు, రాజీవ్ కనకాల,పవిత్రా లోకేష్, షకలక శంకర్, ధనరాజ్, సప్తగిరి, ప్రభాస్ శ్రీను, ధనరాజ్, విద్యుల్లేఖ రామన్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, డ్యాన్స్: శేఖర్, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్, ఎడిటర్: నాగరాజ్, సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎస్.జ్ఞానమ్‌ఎస్. లైన్ ప్రొడ్యూసర్స్: ఆర్.దివాకరన్, ప్రవీణ్.ఎస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కళ్యాణ్ చక్రవర్తి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఓంకార్.