Advertisement

ఎట్టకేలకు పాకశాల సెన్సార్ పూర్తి!


ఐశ్వర్య సినీ స్టూడియో పతాకంపై ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్‌కిరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పాకశాల(దిస్‌ కిచెన్‌ హ్యాజ్‌ ఎ స్టోరీ టు టెల్‌) పేరుతో రూపొందింది. ఈ సినిమా మొదటి కాపీ తయారైనప్పటికీ, అప్పటినుండి అయిదు నెలలు సుదీర్ఘ ప్రయాణం పోరాటంతో ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకొని త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా.. 

Advertisement

నిర్మాత రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం గత కొద్ది నెలలుగా వివాదాస్పద పరిణామాల మధ్య సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది. విశిష్టమైన కథాంశంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆది ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. హైదరాబాద్ సెన్సార్ ఆఫీస్ వాళ్ళు మా సినిమాను తిరస్కరించారు. కాని ఢిల్లీ వెళ్లి ట్రిబ్యునల్ స్థాయిలో అధిగమించి యు/ఏ సెన్సార్ రిపోర్ట్ సాధించాం. మాకు సహకరించిన ట్రిబ్యునల్ చైర్ పర్సన్ రిటైర్డ్ జస్టిస్ శ్రీమతి రేవా ఖేత్రపాల్ మరియు బోర్డు మెంబర్స్ బీన గుప్త, శేఖర్ అయ్యర్, విపిఎస్ గోగియా మరియు రీజినల్ ఆఫీసర్ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు.. అని చెప్పారు.

దర్శకుడు ఫణికృష్ణ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశాను. అందరూ కొత్తవాళ్ళతో కలిసి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా మొదటి కాపీ సిద్ధమయ్యి ఆరు నెలలకు పైగా అయింది. కాని సెన్సార్ సభ్యులు మా చిత్రం స్క్రీనింగ్ కు పనికిరాదని చెప్పారు. కాని ఢిల్లీ వెళ్లి సెన్సార్ రిపోర్ట్ దక్కించుకున్నాం. మేము కొత్త కథ చెప్పట్లేదు. ఉన్న కథను కొత్తగా చూపిస్తున్నాం.. అని చెప్పారు.

గురుకిరణ్ మాట్లాడుతూ.. సినిమా ముప్పై రోజుల్లో పూర్తి చేసాం. పోస్ట్ పోన్ కార్యక్రమాలు అరవై రోజుల్లో పూర్తి చేసాం కాని సెన్సార్ కోసం మాకు ఆరు నెలలు పట్టింది. సెన్సార్ విషయంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. త్వరలోనే సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కీతి, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

విశ్వ, శ్రీనివాస్‌, హరీష్‌ చక్ర సతీష్‌, జగదీష్‌రెడ్డి, అర్పిత, కీర్తి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భరద్వాజ్‌ దాసరి, పాటలు: హరీష్‌చక్ర సతీష్‌, సంగీతం: శ్రవణ్‌ ఎస్‌. మిక్కీ, ఆర్ట్‌: బాలు, ఎడిటింగ్‌: అనిల్‌రాజ్‌, రచన: గురుకిరణ్‌, సహనిర్మాత: ఆర్‌.పి.రావు, నిర్మాత: రాజ్‌కిరణ్‌, దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement