Advertisement
Google Ads BL

రుద్రమదేవి తరువాత ప్రతాపరుద్రుడే!


అనుష్క టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందించిన భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి ద్విభాషా చిత్రం రుద్రమదేవి. అక్టోబర్ 9న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

Advertisement
CJ Advs

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. నేను చాలా కథలు విని ఉంటాను. కాని గుణ కథ చెప్పినప్పుడు ఆయనలో ప్రతి వ్యక్తి కోరుకునే ఓ దర్శకుడు కనిపించాడు. ఆయన ఇండస్ట్రీలో పెద్ద దర్శకుడైనా తెలుగు సంప్రదాయాన్ని, చరిత్రను మర్చిపోకుండా తనకు తెలిసిన సినిమా పరిభాషలో చెప్పాలనుకున్నాడు. కథ విన్న తరువాత నాకు ఇవ్వాల్సిన డబ్బు గురించి కాని, ఎన్ని రోజులు నా పాత్ర షూట్ చేస్తారని కాని ఆలోచించలేదు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం ఇలా అన్ని ప్రాంతాల్లో రుద్రమదేవి గురించి బాగా మాట్లాడడం వింటుంటే ఈ సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా అనిపించింది. ఎందరో హీరోయిన్స్ ను, కళాకారులను చూసాను కాని డబ్బు మాత్రమే కెరీర్ అనుకోకుండా ఇలాంటి ఓ మంచి చిత్రంలో నటించాలని అనుష్క తీసుకున్న శ్రమను ఎవరి దగ్గర చూడలేదు. గోనగన్నారెడ్డి పాత్రను ఎంతో ప్రేమతో, భాద్యత తో అల్లు అర్జున్ చేసాడు. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒకరోజు అరవింద్ గారు ఫోన్ చేసి బన్నీ, గోనగన్నారెడ్డి పాత్రలో నటించడానికి సైన్ చేస్తున్నాడు. నీకు ఈ విషయం చెప్పి సైన్ చేయాలని ఫోన్ చేసానని ఆయన చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది. బన్నీ తన మొదటి చిత్రం నుండి నాతో ఫాలో అవుతున్నాడు. నన్ను గురుర్వుగారు అని పిలుస్తాడు. ప్రస్తుతం ఉన్న యువ హీరోలందరిలో తానంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి సినిమాకు ఏదోకటి నేర్చుకుంటూ.. మెచ్యూడ్ యాక్టర్ లా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. గోనగన్నారెడ్డి పాత్రలో బన్నీ చేయగలడా.. అని చాలా మందికి అనుమానం ఉండేది. కాని ఈ సినిమాలో తనను చూసాకా ఇంకో గోనగన్నారెడ్డి లేడేమో అనిపిస్తుంది. ఈ సినిమా ప్రపంచమంతా ఓ సారి తిరిగి చూసేలా చేసింది. దాసరి లాంటి వ్యక్తి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిమరీ ఈ చిత్రాన్ని అప్రిషియేట్ చేసారు. రాజమౌళి లాంటి పెద్ద దర్శకుడు నిర్విరామంగా తన ట్విట్టర్ లో ఈ సినిమా గురించి చెబుతూనే ఉన్నాడు. దీన్ని బట్టి తెలుగువారి సంస్కారం ఏంటో తెలుస్తుంది. ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని చెప్పారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ.. 25 సంవత్సరాల క్రితం వచ్చిన చారిత్రాత్మక చిత్రం తాండ్రపాపారాయుడు. ఆ తరువాత ఎవరు అలాంటి చిత్రాలు చేయలేదు. తాండ్రపాపారాయుడు సినిమా చూసి మళ్లీ ఇలాంటి సినిమా చేయగలమా అనుకున్నాను. కాని గుణశేఖర్ చేసి చూపించాడు. కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. గుణ డైరెక్ట్ చేసిన మొదటి సినిమాలో నేను నటించాల్సివుంది  కాని కుదరలేదు. అప్పుడే తనలో మంచి దర్శకుడున్నాడని తెలిసింది. అనుష్క చాలా కష్టపడి నటించింది. ప్రకాష్ రాజ్ నటన అధ్బుతం. బన్నీ తన యాస తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. అని చెప్పారు. 

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఓ మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో రుద్రమదేవి చరిత్రను తెరకెక్కించారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడానికి 3 డి లో షూట్ చేసారు. విమెన్ ను సపోర్ట్ చేస్తూ.. సినిమా చేయడమనేది గొప్ప విషయం. ఈ సినిమాకు హీరో అనుష్కనే. నేను కష్టపడింది కేవలం 30 రోజులు మాత్రమే కాని అనుష్క మాత్రం మూడు సంవత్సరాలుగా ఎంత కష్టపడి చేసిందో మాటల్లో చెప్పలేను. ఆ డెడికేషన్, మంచితనం అనుష్కకు తప్ప మరొకరికి లేదు. పెర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని సినిమాకు మొదట సపోర్ట్ చేసిన వ్యక్తి ఇళయరాజా గారే. ఆర్టిస్టులలో ప్రకాష్ రాజు గారు, రానా, ఎంతగానో సపోర్ట్ చేసారు. రానా సంవత్సరంన్నర గా బాహుబలి సినిమాలో నటిస్తూ.. ఈ సినిమా కోసం కూడా కష్టపడ్డాడు. ఈ సినిమాలో నేను నటించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.. అని చెప్పారు.

అనుష్క మాట్లాడుతూ.. నాకు ఈ కథ గుణశేఖర్ గారు నేరేట్ చేసినప్పుడు ఇన్స్పిరేషన్ వచ్చింది. కాని ఆయన చిన్నప్పటినుండి సినిమా చేయాలని అనుకొని చేసారు. రుద్రమదేవి వెనుక ఎందరో టెక్నీషియన్స్ కష్టం ఉంది. ప్రకాష్ రాజ్ గారు, కృష్ణం రాజు గారు, సుమన్, నిత్యమీనన్, కేథరిన్ ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు సపోర్ట్ చేసారు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని చెప్పారు.

గుణశేఖర్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజు గారు ఈ సినిమా నేను మొదలుపెట్టిన తరువాత నాలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ చేసారు. ఆయన మాటలు నాలో చాలా ఉత్తేజాన్ని కలిగించాయి. అనుష్క లేకపోతే రుద్రమదేవి లేదు. మాతో పాటు మూడు సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉంది. తన స్త్రెంగ్థ్ చూసి నాకు ఆశ్చర్యమేసేది. రుద్రదేవుడు, రుద్రమదేవి అనే రెండు పాత్రల్లో తను చూపించిన వేరియేషన్ అధ్బుతం. గోనగన్నారెడ్డి పాత్ర కోసం చాలా స్ట్రగుల్ అయ్యాం. చివరికి అల్లు అర్జున్ ఆ పాత్ర పోషించారు. తను స్క్రీన్ పై ఉన్న యాబై నిమిషాల్లో ప్రతి నిమిషం ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. నా కెరీర్ లో ఒక పాత్రకు ఇంత అప్లాజ్ రావడం మొదటిసారి చూస్తున్నాను. ఇలాంటి కథలను సినిమాగా స్టూడియో అధికారులో, బడా నిర్మాతలు మాత్రమే చేయగలరు. నేను సినిమా చేయడానికి చాలా మంది చాలా రకాలుగా సహకరించారు. అల్లు అరవింద్, దిల్ రాజు, అనుష్క, రానా ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందించారు. ఈ సినిమా చూసిన వారందరూ నాకు కంగ్రాట్స్ చెప్పకుండా.. థాంక్స్ చెబుతున్నారు. గొప్ప చరిత్రను తెలుగువాడు తీసినందుకు గరవంగా ఉందని అందరూ చెబుతున్నారు. కొత్త చిత్రాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాజమౌళి ఇప్పుడు నేను ఇలాంటి చిత్రాలు తీయడం మొదలు పెట్టాం. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. 2009 లో రెగ్యులర్ సినిమాల నుండి ట్రెండ్ సెట్ చేసే అరుందతి చిత్రమొచ్చింది. ఆ తరువాత వచ్చిన మగధీర చిత్రంతో తెలుగు స్టామినా పెరిగింది. రీసెంట్ గా వచ్చిన బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు తెలుగు వాళ్ళను తలెత్తుకునేలా చేసాయి. హిస్టారికల్ ఫిలిం ఈ జనరేషన్ వాళ్లకు ఎలా నచ్చుతుందో.. అనుకున్నాను. కాని కేవలం మౌత్ టాక్ తో బిగ్గెస్ట్ హిట్ చేసారు. డిస్ట్రిబ్యూటర్ గా ఈ టీం తో ట్రావెల్ అవ్వడం చాలా గర్వంగా భావిస్తున్నాను. గుణశేఖర్ గారికి మంచి ప్రొడ్యూసర్ దొరికితే ఈ సినిమా ఇంకా గొప్పగా ఉండేది. ఆయన రుద్రమదేవి కి కంటిన్యూస్ గా ప్రతాపరుద్రుడు సినిమా చేయాలనుకుంటున్నారు. ఆయన కథ సిద్ధం చేస్తే నేను ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాను.. అని చెప్పారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. చారిత్రాత్మక చిత్రాన్ని చలన చిత్రంగా తెరకెక్కించారు. మూడు దశాబ్దాల పాలనను రెండున్నర గంటల్లో చెప్పాలనుకోవడం మాహా యజ్ఞం. చరిత్రను వక్రీకరించకుండా ప్రస్తుతం ఉన్న తెలుగు వారు కాకతీయ చరిత్రను ఒప్పుకునే విధంగా మలిచారు. మూడు తరాల హీరోల కల   గోనగన్నారెడ్డి పాత్ర. ఆ పాత్రలో అన్ని రకాల రసాలు ఉంటాయి. అల్లు అర్జున్ తన పాత్రకు మించి న్యాయం చేసాడు.. అని చెప్పారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs