Advertisement
Google Ads BL

లేటెస్ట్ టెక్నాలజీ తో కొమరం భీమ్!


ఓం సాయి తేజా ఆర్ట్స్ పతాకం పై సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఉట్నూర్ సమర్పణ లో నాగబాల సురేష్ కుమార్ స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం కొమరం భీమ్.  కొమరం భీముగా వైభవ్ సూర్య, నటిస్తున్న ఈ చిత్రం లో ఇంకా అనుభవజ్ఞులైన సుమారు 170 మంది నటీనటులతో, 50 మంది సాంకేతిక నిపుణులతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు నాగబాల సురేష్ కుమార్. అక్టోబర్ 7న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్, జుబ్లీ హిల్స్ లోని భూత్ బంగ్లాలో జరుగుతుండగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి షూటింగ్ విశేషాలను తెలియచేసారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

తెలంగాణా రాష్ట్ర మంత్రి వర్యులు ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులలో వుంది. ఆ ప్రాతంలోని జోడే ఘాట్ లో గోండు జాతికోసం ప్రాణత్యాగం చేసింది కొమరం భీం ఒక్కడే. గిరిజన జాతికే ఆరధ్యంగా, చిరస్మరనీయుడుగా చరిత్రలో నిలిచిన కొమురం భీం అలాంటి మహనీయుని చరిత్రను గతంలో టి వి సీరియల్ గా అందించిన నాగబాల సురేష్ కుమార్ గారు ఇప్పుడు సినిమాగా రూపొందిచడం అభినందించాలి. గత ఏడాది అక్టోబర్ 27న మన రాష్ట్ర ముఖ్యమంత్రి  కెసిఆర్ గారు కొమరం భీమ్ జయంతి సందర్భం గా అక్కడికి వెళ్లి 25 కోట్ల రూపాయలతో గిరిజన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. సినిమా రంగంపై వున్నా అభిమానంతో రాచకొండలో ఫిలిం సిటీ నిర్మాణానికి నాంది పలికారు. ఇక మున్ముందు కూడా తెలంగాణా పోరాట యోధుల కథలను చిత్రరూపంలో ప్రజలకి అందించవలసిన అవసరం వుంది.. అన్నారు 

చిత్ర నిర్మాత దర్శకుడు నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ.. గతం లో ఇదే బ్యానర్ పై వీర భీమ్ గా  కొమరం భీమ్ చరిత్రను 70 ఎపిసోడ్స్ గా తీసాను. దూరదర్శన్ లో ఈ సీరియల్ మంచి ప్రజాదరణ పొందింది. గోండుల సంక్షేమమే ధ్యేయంగా, వారి సాంస్కృతీ  సంప్రదాయాల పరిరక్షణే ఉచ్చ్వాస  నిస్వాసాలుగా, వారి ఆత్మ గౌరవ రక్షణే ఎకైక ధ్యేయంగా, గిరిజన జాతి అభ్యున్నతే ప్రధాన ఆషయంగా నిరంతరం తపించిన వీర గిరిజన యోధుడు కొమరం భీం జాతి నవనిర్మాణం కోసం ప్రణాల్ని తృణప్రయంగా త్యజించిన అద్బుత అమరవీరుడి జీవిత చరిత్రకు వెండితెర రూపం ఇస్తే బాగుంటుందని ఈ చిత్రాన్ని ప్రారంభించాను. సీరియల్ లో చేసిన నటి నటులతో పాటు సినీరంగానికి చెందిన నటులతో మొత్తంగా 170 మంది ఆర్టిస్టులతో, ఈ చరిత్రను ఎలాంటి కాంట్రవర్సి లేకుండా, అన్ని వర్గాలను అలరించే విధం గా నిర్మిస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తారని బావిస్తున్నాను.. అన్నారు 

మరో ముఖ్య అతిధి రాష్ట్ర సలహాదారులు వేణుగోపాలచారి మాట్లాడుతూ.. నాగబాల సురేష్ కుమార్ కి ఈ చిత్రం ద్వారా ఆర్ధికం గా ఎంత వస్తుందో ఎంతపోతుందో గాని, ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యుడిగా చరిత్రలో నిలిచిపోతాడు.నిన్న సీరియల్ ద్వారా రేపు చిత్రం ద్వారా  కొమరం భీమ్ జీవిత కధను బావితరాలకు అందించిన వాడు అవుతాడు..  అన్నారు

కొమరం భీమ్ పాత్రధారి వైభవ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు టివీలలో సినిమాలలో ఎన్నో పాత్రలు వేసిన నాకు తెలంగాణా పోరాట యోధుడు కొమరం భీమ్ లాంటి మహోన్నత వ్యక్తి పాత్ర వేయడం నిజంగా నా అదృష్టం. ఎవరికి దొరకని ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన నాగబాల సురేష్ గారికి జన్మంతా రుణపడి వుంటాను.. అన్నారు 

ఈ చిత్రంలో కొమరం భీముగా - వైభవ్ సూర్య, పైకూభాయిగా - స్వప్న,  సత్తార్గా రామకృష్ణతో పాటు మానిక్, హేమసుందర్, ఉమ మహేశ్వర్ రావు, లవకుశ నాగరాజు, అనిల్, జొసఫ్ బబూరవు, రమణ, కల్పన, చిత్ర, స్రిలక్ష్మి, జ్యోతి, మొదలైన నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సహకారం: కొమురం సోనేరావు, శిడాం అర్జు, కెమెరా : గోపి, తిరుపతి రెడ్డి, కన్నా, పాటలు: సుద్దాల అశొక్ తేజ, తోటపల్లి భూమన్న, సంగీతం: నాగరాజు, గ్రాఫిక్స్: మోహన్ రాజు, సుధాకర్ కె నాయుడు, మేకప్: వాసు, అర్ట్: రాజేష్, కాస్ట్యూంస్: తిరుమల, ఎడిటర్స్: ఎల్దండి రాజు, సాయి శశాంక్, అసోసియేట్ డైరెక్టర్: ఆదిత్య, క్రియేటివ్ హెడ్: మానస్ దండనాయక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: ఎస్ ఎస్ రమశంకర్, కో-డైరెక్టర్స్: ఎం ఎస్ చౌదరి, పల్నాటి పాంచజన్యం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శ్రీమతి డి.లలిత, శైలేష్ కుమార్, నిర్మాణ పర్యవేక్షణ: వై.సంపత్ కుమార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగబాల సురేష్ కుమార్.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs