Advertisement
Google Ads BL

టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న ఒవియా హెలెన్‌.!


తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్‌ అయిన ఒవియా హెలెన్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. చాలా గ్యాప్‌ తర్వాత తరుణ్‌ హీరోగా ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అభిరామ్‌ సమర్పణలో రమేష్‌ గోపి దర్శకత్వంలో ఎస్‌.వి.ప్రకాష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒవియా హెలెన్‌ హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ అయింది. గ్లామరస్‌ హీరోయిన్‌గా ఇప్పటికే ఇతర భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న ఒవియా తెలుగు ప్రేక్షకుల్ని తన గ్లామర్‌తో అలరించడానికి త్వరలో రాబోతోంది. అక్టోబర్‌ 10 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఉడిపి, కూర్గ్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకునే ఈ చిత్రంలో 6 పాటలు వున్నాయి. ఇందులో రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత ప్రకాష్‌. లవర్‌బోయ్‌గా ఒక ఇమేజ్‌ని ఏర్పరచుకొని ఎన్నో లవ్‌ ఎంటటైనర్స్‌ చేసిన తరుణ్‌ చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న ఈ సినిమా తనకు చాలా హెల్ప్‌ అవుతుందని నమ్ముతున్నాడు. హీరోయిన్‌గా తనని తాను ప్రూవ్‌ చేసుకున్న ఒవియా కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో సినిమాకి మరింత ప్లస్‌ అయ్యే అవకాశం వుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs