Advertisement
Google Ads BL

రాయ్‌లక్ష్మీ సెల్ఫీ విత్‌ పవర్‌స్టార్‌.!


పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న రాయ్‌లక్ష్మీ, పవన్‌కళ్యాణ్‌కి సంబంధించిన సీన్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంలోనే పవన్‌తో రాయ్‌లక్ష్మీ ఓ సెల్ఫీ తీసుకుంది. దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పవర్‌స్టార్‌తో సెల్ఫీ దిగుతానని, దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తానని గతంలోనే చెప్పిన రాయ్‌లక్ష్మీ చెప్పినట్టుగానే సెల్ఫీ తీసుకుంది. ఈ చిత్రంలో హీరోయన్‌ కాజల్‌ అయినప్పటికీ రాయ్‌లక్ష్మీ క్యారెక్టర్‌కి కూడా చాలా ఇంపార్టెన్స్‌ వుందట. ఇందులో ఆమెకు రెండు పాటలు కూడా వుండడం విశేషం. ఈ చిత్రంతో తెలుగులో తనకి మంచి బ్రేక్‌ వస్తుందని ఆశిస్తోంది ఈ బ్యూటీ. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఔట్‌పుట్‌ విషయంలో పవన్‌కళ్యాణ్‌ హ్యాపీగానే వున్నాడట. అయితే షూటింగ్‌ని మరింత స్పీడప్‌ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడని తెలిసింది. గబ్బర్‌సింగ్‌ తర్వాత దేవిశ్రీప్రసాద్‌ మరోసారి ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్‌ ఇస్తున్నాడు. దేవి ఇచ్చిన ట్యూన్స్‌ కూడా పవన్‌కళ్యాణ్‌కి బాగా నచ్చాయట. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs