Advertisement
Google Ads BL

ఒక్క అమ్మాయి తప్ప సినిమా ప్రారంభం!


సందీప్ కిషన్ హీరోగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై బోగది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఒక్క అమ్మాయి తప్ప. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ.. ప్రేమించుకుందాం రా సినిమాతో రచయితగా ప్రయాణం మొదలుపెట్టాను. సురేష్ బాబు, పరుచూరి బ్రదర్స్ వంటి వారి దగ్గర రచయితగా పని చేసాను. సందీప్ కిషన్ కు మూడు సంవత్సరాల క్రితం నేను ఈ సినిమా కథ చెప్పాను. ఆయనకు నచ్చడంతో అప్పటి నుండి నాతో ట్రావెల్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇంతకముందే చేయాల్సివుంది కాని కుదరలేదు. ఇదొక కమర్షియల్ మూవీ. కొత్త బ్యాక్ డ్రాప్ తో ఉంటుంది. సినిమాలో 45 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటుంది. షూటింగ్ కోసం పెద్ద ఫ్లై ఓవర్ సెట్ వేస్తున్నాం. అక్టోబర్ 10 నుంచి షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ కు ముగించాలని ప్లాన్ చేస్తున్నాం. మిక్కి జె మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం ఆనందంగా ఉంది.. అని చెప్పారు.  

మిక్కి జె మేయర్ మాట్లాడుతూ.. రొటీన్ లవ్ స్టొరీ సినిమాకు సందీప్ తో కలిసి వర్క్ చేసాను. మరోసారి ఆయనతో వర్క్ చేస్తుండడం సంతోషంగా ఉంది. రాజ గారు మంచి ఎనర్జిటిక్ డైరెక్టర్. ఆయన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి.. అని చెప్పారు.

అంజిరెడ్డి మాట్లాడుతూ.. సినిమా చూపిస్త మావా చిత్రంతో నిర్మాతగా మారాను. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలానే ఈ మూవీ కూడా పెద్ద విజయం సాధించాలి.. అని చెప్పారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఈ స్టొరీ రాజసింహ నాకు 2012 లో చెప్పాడు. కథను నమ్మి ఆయనతో ట్రావెల్ చేసాను. నాకు మొదట రాజ ఓ స్క్రిప్ట్ నేరేట్ చేసేప్పుడు అసలు నచ్చకపోవడంతో రెండో స్క్రిప్ట్ వినకూడదు అనుకున్నాను. కాని విన్న తరువాత చాలా నచ్చింది. అంజిరెడ్డి గారికి కూడా నచ్చడంతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కొత్త బ్యాక్ డ్రాప్ లో ఉండే కథ. లవ్ స్టొరీ కూడా ఉంటుంది. తెలివైన కాలేజి కుర్రాడి పాత్రలో కనిపిస్తాను.. అని చెప్పారు.

చోటా కె నాయుడు మాట్లాడుతూ.. అంజిరెడ్డి గారు ప్రొడ్యూసర్ అనగానే సినిమాపై చాలా నమ్మకం కుదిరింది. అదే నమ్మకంతో అందరం కలిసి సినిమా చేస్తున్నాం.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చిన్నా, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్: చిన్నా, మ్యూజిక్ డైరెక్టర్: మిక్కి జె మేయర్, ఎడిటర్: గౌతంరాజు, సి.జి.ఐ: డి.క్యు.ఎంటర్టైన్మెంట్ ప్రి. లిమిటెడ్, కో డైరెక్టర్: మల్లిఖార్జున రెడ్డి, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: ఎమ్.శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్స్: నవీన్ చంద్రశేఖర్, రామానంద సాగర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆళ్ళ రాంబాబు, కాస్ట్యూమ్స్: బుజ్జి, మేకప్: గంగాధర్. ప్రొడ్యూసర్: బోగది అంజిరెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: రాజసింహ తాడినాడ.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs