ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం శివమ్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. శివమ్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ.. హై ఓల్టేజ్ లవ్ స్టోరీతో రూపొందిన చిత్రం ఇది. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేశారు. కథాబలం ఉన్న చిత్రం ఇది. స్ర్కీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా కుదిరింది. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలను ఇటీవలే విడుదల చేశాం. అన్ని పాటలకూ అద్భుతమైన స్పందన లభిస్తోంది. విజువల్ గా కూడా పాటలు ఐ ఫీస్ట్ గా ఉంటాయి. ముఖ్యంగా నార్వే, స్వీడన్ లలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన పాటలు చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. అక్టోబర్ 2న చిత్రాన్ని విడుదల చేస్తాం.. అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ఇందులో రామ్ లుక్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుంది. నటన సూపర్బ్. రామ్ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. రామ్, రాశీఖన్నా పెయిర్ చూడచక్కగా ఉంటుంది. మామూలుగా సినిమా సక్సెస్ గురించి విడుదలకు ముందు మాట్లాడని దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం ఆడియో ఫంక్షన్లో ఈ సినిమా సూపర్ హిట్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. పాటలు మాత్రమే కాదు. ఆర్.ఆర్. కూడా ఆయన అద్భుతంగా చేశారు. టెక్నికల్ గా ఈ చిత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. రసూల్ ఫొటోగ్రఫీ హైలైట్ గా నిలుస్తుంది.. అని చెప్పారు.
బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్.