Advertisement
Google Ads BL

కంచె సినిమా ఆడియో విశేషాలు!


మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో రామ్ చరణ్ తేజ్ బిగ్ సీడీను ఆవిష్కరించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి కాపీను రామ్ చరణ్ కు అందించారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

రామ్ చరణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ చిత్ర సంగీత దర్శకుడు చిరంతన్ భట్ తో నాకు ఎప్పటినుండో పరిచయం ఉంది. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం అధ్బుతం. వరుణ్ తేజ్ మా ఫ్యామిలీ అందగాడు. కెరీర్ మొదట్లోనే ఇలాంటి గట్స్ ఉన్న కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. తక్కువ బడ్జెట్ మంచి క్వాలిటీతో ఈ సినిమాను రూపొందించారు. డైరెక్టర్ క్రిష్ నేను మంచి ఫ్రెండ్స్. నాతో సినిమా చేయమని నేను ఏ డైరెక్టర్ ను ఇప్పటివరకు అడగలేదు. కాని క్రిష్ ను ఐదు సంవత్సరాలుగా అడుగుతున్నాను. నాతో సినిమా ఎప్పడు చేస్తాడా అని వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి నా అభినందనలు.. అని చెప్పారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందని తెలిసి వెంటనే ఓ సైట్ ఓపెన్ చేసి రెండు మూడు సార్లు చూసాను. ట్రైలర్ నాకు అంతగా నచ్చింది. ఇండస్ట్రీలో రెండు రకాల దర్శకులు ఉంటారు. ప్రేక్షకుల అభిరుచిని బట్టి సినిమా తీసేవారు ఒకరైతే ప్రేక్షకుల అభిరుచిని పెంచేలా తీసే దర్శకులు మరొకరు. అందులో క్రిష్ రెండో రకానికి చెందినవాడు. విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించడంలో క్రిష్ కు సాటిలేరు. వరుణ్ పాత్రలో ఇంటెన్సిటీ కనిపిస్తుంది. సినిమా మంచి సక్సెస్ కావాలి.. అని చెప్పారు.

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. ప్రపచంలో జరిగిన గొప్పయుద్ధాల్లో గొప్పది రెండో ప్రపంచ యుద్ధం కానీ 75 సంవత్సరాలుగా ఇటువంటి కథతో తెలుగులో సినిమాలు రాలేదు. పరిపూర్ణంగా ఈ కథ రాసుకున్న తరువాతే ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా ఎలా చెప్పాలో తెలిసింది. మన దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. చాలా కథలు మరుగున పడిపోతున్నాయి. ఇలాంటి చెప్పని కథలను నాకు ఈ సినిమా ద్వారా చెప్పే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు. చిరంతన్ భట్ ఈ చిత్రానికి అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సిరివెన్నెల గారి సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మా పెదనాన్న చిరంజీవి గారికి నేను పెద్ద అభిమానిని. కంచె లాంటి మంచి సినిమాలో నటించి ఆయన పరువు నిలబెడుతున్నాను. మా బాబాయికి ఈ సినిమా ఖచ్చితంగా చూపిస్తాను. నా కుటుంబసభ్యులే కాకుండా ప్రతిఒక్కరు గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది. ఇలాంటి ఓ మంచి కథను రాసుకొని సినిమా చేయడం గొప్ప విషయం. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన క్రిష్ గారికి నా ధన్యవాదాలు.. అని చెప్పారు.

నాగబాబు మాట్లాడుతూ.. ముకుంద సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కంచె కూడా హిట్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ కథను క్రిష్ నాకు చెప్పినప్పుడు అందులోని డెప్త్‌ నాకు అర్తమయ్యింది. నాపై చాలా ఇంపాక్ట్‌ చూపిన సినిమా. కొన్ని క్లిప్పింగ్స్ చూసాను. కెమరామెన్, ఆర్ట్ డైరెక్టర్ మిగిలిన టెక్నికల్ టీం అంత చాలా ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేసారు.. అని చెప్పారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. హాలీవుడ్, బాలీవుడ్ లలో ఈ తరహా చిత్రాలు వచ్చి ఉండొచ్చు. కాని తెలుగులో చేస్తున్న మొట్ట మొదటి ప్రయత్నమిది. చరిత్రలో వెనక్కి తీసుకువెళ్ళడంతో పాటు మన ఆలోచనలని కూడా అటు తీసుకువెళ్తున్న క్రిష్ అభినందనీయుడు. సినిమాలో కొన్ని క్లిప్పింగ్స్ చూస్తున్నప్పుడు వరుణ్ నటన చూసి ఆశ్చర్యమేసింది. రెండో చిత్రంలోనే ఇన్ని భావోద్వేగాలను చూపించడం సామాన్య విషయం కాదు. ఈ సినిమా ద్వారా ఓ గొప్ప నటుడ్ని చూడబోతున్నాం. నిజంగా ఈ సినిమాలో గొప్ప పాటలు రాసాను. చిరంతన్ భట్ అధ్బుతమైన బాణీలు అందించారు. సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది. అని చెప్పారు.

చిరంతన్ భట్ మాట్లాడుతూ.. నేను చెన్నైలో మ్యూజిక్ నేర్చుకున్నాను. సౌత్ లో మ్యూజిక్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన క్రిష్ కు థాంక్స్. మంచి ఇంటెలిజెంట్ డైరెక్టర్. సీతారామశాస్త్రి గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది.. అని చెప్పారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ఈ సినిమా చేయాలనే ఆలోచన రావడానికి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా గట్స్ కావాలి. ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంది. వరుణ్ వైవిధ్యమైన సినిమాలను మాత్రమే ఎన్నుకుంటున్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ.. ఈ కంచె క్లాస్ మూవీ, మాస్ మూవీ అని ఉన్న కంచె ను తీసేస్తుంది. ఇది నాకు ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమాకు పని చేయడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అధ్బుతమైన సాహిత్యాన్ని అందించారు.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సి.కళ్యాణ్, చిత్ర నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయి బాబు, శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, హీరోయిన్ ప్రజ్ఞాజైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.

నికితన్ ధీర్, అవసరాల శ్రీనివాస్, గొల్లపూడి, షావుకారు జానకి, సింగీతం శ్రీనివాస్, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అనూప్ పూరి, మెరీనా టారా ఇతర తారాగణంగా నటిస్తోన్నఈ చిత్రానికి కొరియోగ్రఫీ: బృంద, స్టంట్స్: వెంకట్, డేవిడ్ కుబువా, ఎడిటర్స్: సూరజ్ జగ్ తాప్, రామకృష్ణ అర్రమ్, ఆర్ట్: సాహి సురేష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, సాహిత్యం: సీతారామశాస్త్రి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జ్ఞాన‌శేఖ‌ర్‌, మ్యూజిక్: చిరంతన్ భట్ , నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs