సిక్స్‌ఫ్రెండ్స్ క్రియేషన్స్ బ్యానర్‌లో మాస్టర్ శ్రీరామచంద్ర గొర్రెపాటి సమర్పణలో దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, పి.సి. రెడ్డిల శిష్యుడు డా||కృష్ణమోహన్ గొర్రెపాటి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కనున్న చిత్రం కుర్రతుఫాన్. సీనియర్ నటీనటులతో పాటు కొత్తవాళ్ళను పరిచయం చేస్తూ రూపుదిద్దకోనున్న ఈ చిత్రం అక్టోబర్ 16న పూజాకార్యక్రమాలతో ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డా||కృష్ణమోహన్ గొర్రెపాటి మాట్లాడుతూ..సిక్స్‌ఫ్రెండ్స్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపుదిద్దుకోనున్న కుర్రతుఫాన్ చిత్రంకు చక్కని కథ, కథనం కుదిరాయి. హీరో, హీరోయిన్ల సెలక్షన్స్ జరుగుతున్నాయి. వారం రోజుల్లో సెలక్షన్స్ పూర్తవుతాయి. ఈ చిత్రంలో ఎందరో సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. మా గురువుగారు ఎస్వీ కృష్ణారెడ్డిగారు, పి.సి. రెడ్డిగార్లు ఎన్నో మంచి చిత్రాలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు. వాళ్ళ శిష్యునిగా మరిన్ని మంచి చిత్రాలను ఇండస్ట్రీకి అందించాలనే సంకల్పంతో రాసుకున్న కథే కుర్రతుఫాన్. ఈ చిత్రం ఆద్యంతం అందరినీ నవ్విస్తూ..మెప్పిస్తుంది. అక్టోబర్ 16న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభించి..ఏకధాటిగా చిత్రీకరణ జరుపనున్నాము. దర్శకునిగా తొలి చిత్రంతో అడుగుపెడుతున్నాను. మా గురువుగారి ఆశీస్సులతో పాటు..ప్రేక్షకులందరి ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటున్నాను. త్వరలోనే ఇతర తారాగణంతో పాటు చిత్ర పూర్తి వివరాలను తెలియజేస్తాము... అని అన్నారు.
నూతన తారాగణంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి
కెమెరా: గోపాల్, సామరాజు;
సంగీతం: పద్మనావ్ టి.పి,
ప్రొడక్షన్ డిజైనర్: మహేష్ తాళ్ళూరి;
సమర్పణ: మాస్టర్ శ్రీరామచంద్ర గొర్రెపాటి;
నిర్మాణం: సిక్స్‌ఫ్రెండ్స్ క్రియేషన్స్
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: డా||కృష్ణమోహన్ గొర్రెపాటి