సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ బేనర్‌ను స్టార్ట్ చేసి తొలి చిత్రంగా సి.కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులకు అందించిన 'చంద్రకళ' పెద్ద హిట్ అయి కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. హార్రర్ సినిమాలు ఓ మోస్తరుగా వున్నా తెలుగు ఆడియన్స్ ఆ సినిమా సూపర్‌హిట్ అంటున్నారు. అలాంటిది తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తే మినిమం గ్యారెంటీ వుంటుందన్న ఆలోచనతో పిశాచి, డిమోంటె కాలనీ వంటి హార్రర్ సినిమాలను కూడా తన బేనర్ ద్వారా తెలుగులో రిలీజ్ చేశాడు సి.కళ్యాణ్. లేటెస్ట్‌గా సి.కళ్యాణ్ చేస్తున్న సినిమా 'మయూరి'.
నయనతార ప్రధాన పాత్రలో 'మాయ' పేరుతో తమిళ్‌లో రూపొందిన ఈ సినిమాలో ఆడియన్స్‌ని థ్రిల్ చేసే అంశాలు ఎన్నో వున్నాయట. విజువల్ ఎఫెక్ట్స్‌లో, రీరికార్డింగ్‌లో ఎంతో అడ్వాన్స్‌డ్‌గా చిత్రీకరించిన ఈ సినిమా డెఫినెట్‌గా ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుందని సి.కళ్యాణ్ చెప్తున్నాడు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి., శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకాలపై శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు నిర్మాతలుగా 'మయూరి' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 17న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది.