Advertisement
Google Ads BL

గీతాంజలి కంటే మంచి సినిమా అంట!


తెలుగమ్మాయి స్వాతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'త్రిపుర'. నవీన్ చంద్ర కథానాయకుడు. 'గీతాంజలి' ఫేం రాజకిరణ్ దర్శకత్వం వహించారు. తమిళంలో 'తిరుపుర సుందరి' పేరుతో తెరకెక్కించారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ చిత్రాన్ని నిర్మించారు. జివ్వాజి రామాంజనేయులు సమర్పకులు. కామ్రాన్ సంగీత దర్శకుడు. శుక్రవారం ఈ టీజర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నవీన్ చంద్ర, స్వాతి, చంద్రబోస్, ఎ.చినబాబు, కామ్రాన్, మాటల రచయిత రాజా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

చంద్రబోస్ మాట్లాడుతూ.. "మనం స్వాతికిరణం, స్వాతిముత్యం చూశాం. ఈ చిత్రం స్వాతి స్వప్నం. అంత అద్బుతమైన గొప్ప కథ. కథ విన్న తర్వాత మూడు రోజులు అదే లోకంలో ఉన్నాను. నాకు ఎటువంటి అనుభూతి కలిగిందో.. ప్రేక్షకులు కూడా అదే అనుభూతికి లోనవుతారని ఆశిస్తున్నాను. రాజకిరణ్ మంచి కథ రాశారు. స్వాతి, నవీన్ చంద్ర బాగా నటించారు. కామ్రాన్ మంచి సంగీతం అందించారు. నిర్మాత చినబాబు నిండు మనసుతో నిర్మించారు. ఇలాంటి మంచి సినిమాలను ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నాను" అని అన్నారు. 

వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "టీజర్ బాగుంది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. కథాబలం ఉన్న సినిమా ఇది. దెయ్యం సినిమా అయినా మంచి ఫీల్ ఉంది. మాటల రచయిత రాజా, సంగీత దర్శకుడు కామ్రాన్ హార్డ్ వర్క్ చేశారు. నాకు స్క్రీన్ ప్లే రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు" అని అన్నారు. 

సంగీత దర్శకుడు కామ్రాన్ మాట్లాడుతూ.. "కథ చాలా బాగుంది. కథ వినగానే ఇంప్రెస్ అయ్యి సాంగ్స్ చేశాను. మంచి పాటలను దర్శకుడు ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం సెకండ్ హాఫ్ రీ రికార్డింగ్ జరుగుతుంది" అని అన్నారు. 

నవీన్ చంద్ర మాట్లాడుతూ.. "మంచి టీం వర్క్ ఉంటే మంచి ప్రోడక్ట్ వస్తుందని చెప్పడానికి 'త్రిపుర' మూవీ నిదర్శనం. మంచి సినిమాలో నాకు ఓ పాత్ర ఇచ్చినందుకు థాంక్స్. దర్శకుడు నా క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. స్వాతితో కలసి నటించడం హ్యాపీ. సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరూ లేరు. కథే హీరో. ఎగ్జయిటింగ్ స్క్రిప్ట్. దెయ్యం సినిమా కాదు, ఇందులో ఎమోషనల్ లవ్ స్టొరీ కూడా ఉంది. నిర్మాత చినబాబు ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. నా కెరీర్లో బెస్ట్ ఆల్బమ్ ఇది. చంద్రబోస్, కామ్రాన్ లకు థాంక్స్" అని అన్నారు. 

చినబాబు మాట్లాడుతూ.. "దర్శకుడు రజకిరన్ నాకు ఏదైతే కథ చెప్పారో.. దాన్ని అంత కంటే అద్బుతంగా తీశారు. మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చింది. సినిమా ప్రారంభమైన మొదటిరోజు నుంచి రాజా, వెలిగొండ శ్రీనివాస్ కథపై వర్క్ చేశారు. మా క్రేజీ మీడియాకు కోన వెంకట్ గారు గాడ్ ఫాదర్. పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నా కథ నచ్చడంతో స్క్రీన్ ప్లే విషయంలో సహకరించారు. నవీన్ చంద్ర, స్వాతి, ఇతర టెక్నీషియన్లు అందరూ ఎంతో సహకరించారు. బయట నుంచి సపోర్ట్ చేసిన హను రాఘవపూడి, కిరణ్ కుమార్, నవీన్ గాంధీలకు థాంక్స్" అని అన్నారు. 

స్వాతి మాట్లాడుతూ.. "సినిమాలో నా లుక్ విడుదలైన తర్వాత చాలా మంది ఫోన్ చేసి తెలుగమ్మాయిలా ఉన్నావని ప్రశంసిస్తున్నారు. పల్లెటూరి నుంచి నగరం వచ్చిన అమ్మాయి పాత్రలో నటించా. భర్త అంటే ప్రాణం. త్రిపుర చూస్తున్న సమయంలో క్యారెక్టర్ మాత్రమే కనిపించాలని హోంవర్క్ చేశాం. సినిమా చూస్తున్న సమయంలో త్రిపుర గుర్తొస్తే చాలు. టీంవర్క్ లా అందరం కలసి ఓ కుటుంబంలా పనిచేశాం" అని అన్నారు. 

దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ.. "కథ, కథనం, మాటలు ఎలా ఉన్నా, వాటికి తగ్గ పాత్రలు దొరికినపుడే మంచి సినిమా వస్తుంది. ఆ పాత్రలే స్వాతి, నవీన్ చంద్ర. రావు రమేష్ లేకుండా సినిమా చేయడం కష్టం. అంత బాగా నటించారు. కథ అనుకున్న తర్వాత వెలిగొండ శ్రీనివాస్, రాజా చాలా హెల్ప్ చేశారు. చినబాబు లాంటి నిర్మాత దొరకడం అదృష్టం. చంద్రబోస్ గొప్ప సాహిత్య విలువలున్న పాటలు రాశారు. గీతాంజలి కంటే మంచి సినిమా త్రిపుర" అని అన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs