Advertisement
Google Ads BL

విడుదలైన 'శ్రీమతి బంగారం' ఆడియో!


రిషి, రాజీవ్ కనకాల, ప్రియాంక, వృషాలి నటీనటులుగా శ్రీ మహేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై చెన్న శ్రీనివాస్, కొత్త సత్యనారాయణ రెడ్డి నిర్మించిన సినిమా 'శ్రీమతి బంగారం'. ఎం.వినయ్ బాబు దర్శకత్వం వహించారు. సిద్ధ బాపు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రాత్రి హైదరాబాద్, ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రసన్న కుమార్ ఆడియో ఆవిష్కరించారు.

Advertisement
CJ Advs

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. "టైటిల్, ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఇలాంటి సినిమా చూసి చాలా కాలమైంది. ప్రతి మహిళ ఈ సినిమా చూసి ఆదరించాలి. రిలీజ్, థియేటర్ల విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్దంగా ఉన్నాను. పబ్లిసిటీ బాగా చేయాలి" అని అన్నారు. 

తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. "టైటిల్ తోనే శ్రీమతులను దర్శకుడు పడేశాడు. కాబట్టి ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది" అన్నారు.   

శివాజీ రాజా మాట్లాడుతూ.. "ఒక రైతు, ఒక నేత కలసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిట్టయి వారికి మరిన్ని సినిమాలు నిర్మించే ప్రోత్సాహం రావాలి. చిన్న సినిమాలు సక్సెస్ అయితే ఎంతో మంది టెక్నీషియన్లు బ్రతుకుతారు. పాటలు, ట్రైలర్ బాగున్నాయి. టీంకి అల్ ది బెస్ట్" అని అన్నారు. 

దర్శకుడు వినయ్ బాబు మాట్లాడుతూ.. "లవ్, యాక్షన్, హారర్ సినిమాలంటూ ఒక ధోరణిలో వెళ్తున్న సమయంలో డిఫరెంట్ సినిమా చేయాలని 'శ్రీమతి బంగారం' చేస్తున్నాను. భార్యాభర్తల బంధం తెలిపే ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా ఇది. నిర్మాతలు కథ చెప్పిన వెంటనే ఓకే చేసి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. అపార్థాల వలన ఎలాంటి అనర్థాలు వస్తాయో అనే అంశంతో చిన్న మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా" అని అన్నారు. 

సంగీత దర్శకుడు సిద్ధ బాపు మాట్లాడుతూ.. "వందేమాతరం శ్రీనివాస్ వద్ద చాలా సినిమాలకు కోరస్ సింగర్ గా పని చేశాను. మిగతా దర్శకుల సినిమాలకు కూడా పని చేశా. సిద్ధ మ్యూజికల్ అకాడమీ స్థాపించి మా పిల్లలు ఇద్దరూ సంగీతం నేర్పిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. పాటలు మీ అందరికి నచ్చుతాయని ఆశిస్తున్నాను" అని అన్నారు. 

నిర్మాతలు మాట్లాడుతూ.. "మంచి కథ. దర్శకుడు సినిమాను బాగా తీశారు. ప్రేక్షకులు మా ప్రయత్నం ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు. 

అల్లం పద్మ మాట్లాడుతూ.. "మంచి టైటిల్, శ్రీమతులందరూ సినిమా చూసి విజయవంతం చేయాలి. ట్రైలర్ చూసిన తర్వాత భార్యాభర్తల అనుబంధాన్ని, గొప్పతనాన్ని చూపించారని తెలుస్తుంది. నిజంగా శ్రీమతి బంగారమే. ఎందుకంటే, శ్రీమతి అన్ని చూసుకోవడంతో మగాడు టాబ పని చూసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నాడు, ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉన్నదనే మాట నిజం" అని అన్నారు. ఈ కార్యక్రమంలో 'లయన్' సాయి వెంకట్, కాదంబరి కిరణ్, డా. రాజేశ్వరి, మదాల రవి, వృషాలి తదితరులు పాల్గొన్నారు.           

వేణుమాధవ్, హేమ, శ్రీకాంత్ రెడ్డి, తీన్ మార్ మల్లన్న తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు : ఘటికాచలం, ఎడిటింగ్ : నందమూరి హరి, కెమెరా : సహదేవ్, కోరియోగ్రఫీ : వేణుపాల్, రామ్, ఫైట్ మాస్టర్ : సూపర్ ఆనంద్, నిర్వహణ : జివి సత్యనారాయణ, నిర్మాతలు : చెన్న శ్రీనివాస్, కొత్త సత్యనారాయణ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎం.వినయ్ బాబు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs