Advertisement

తెలుగులో స్ట్రయిట్‌ ఫిలిం చేస్తా-విశాల్!


విశాల్, కాజల్ అగర్వాల్ జంటగా సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై జె.రామాంజనేయులు సమర్పణలో సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'పాయుంపులి'. ఈ చిత్రాన్ని 'జయసూర్య' అనే టైటిల్ తో జి.నాగేశ్వరరెడ్డి, ఎస్.నరసింహ ప్రసాద్ నిర్మాతలుగా తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొరటాల శివ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి సీడీను నాని, సుశాంత్ లకు అందించారు. వి మ్యూజిక్‌ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా... 

Advertisement

కొరటాల శివ మాట్లాడుతూ ''సుసీంద్రన్‌ దర్శకత్వంలో వచ్చిన నా పేరు శివ సినిమా చూసే మదిని సినిమాటోగ్రాఫర్‌గా పెట్టుకున్నాను. ఇంటెన్స్‌ ఫిలిం మేకర్ సుసీంద్రన్. నేను రచయితగా ఉన్నప్పుడు విశాల్ కోసం ఓ కథ రాయానుకునేవాడ్ని. కాని కుదరలేదు. ఇమాన్‌ అందించిన మ్యూజిక్‌ బావుంది'' అని అన్నారు. 

విశాల్‌ మాట్లాడుతూ ''పేదరికంతో చాలా మంది మహిళలు చదువు లేకుండా బాధపడుతున్నారు. నేను వారికి నాకు తోచిన విధంగా సహాయపడుతున్నాను. మీలో ప్రతి ఒక్కరు కూడా తోచినంత సహాయం చేయాలని ఆశిస్తున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌. నేను పోలీస్‌గా చేస్తున్న మూడో సినిమా. పోలీస్ కథలో కొత్తదనం ఉంటుంది. సుసీంద్రన్‌ బెస్ట్‌ స్క్రీన్‌ప్లే ఇచ్చాడు. ఈ సినిమా సెప్టెంబర్‌ 4న తెలుగు, తమిళంలో ఓకేసారి విడుదలవుతోంది. సినిమా చూశాను. గ్యారంటీగా సినిమా పెద్ద హిట్టవుతుంది. తమిళంలో ఉన్న కమిట్మెంట్స్ వల్ల తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేయలేకపోతున్నాను. త్వరలోనే శశికాంత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ గౌడ్‌ నిర్మాతగా సినిమా చేస్తాను'' అని అన్నారు. 

దర్శకుడు సుసీంద్రన్‌ మాట్లాడుతూ ''పల్నాడు తర్వాత నేను విశాల్‌ కలిసి చేసిన సినిమా ఇది. సినిమా మంచి కాన్సెప్ట్‌తో రూపొందింది. ఇమాన్‌ గారు మంచి మ్యూజిక్‌ అందించారు. ఆడియో, సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ ''పవర్‌ఫుల్‌ పోలీస్‌ స్టోరీ. నేను, మదన్‌ చేస్తున్న ఈ సినిమాని తెలుగులో నాగేశ్వరరెడ్డి, నరసింహ ప్రసాద్‌లు కలిసి విడుదల చేస్తున్నారు. విశాల్‌ మంచి డెడికేషన్‌ ఉన్న హీరో. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. తన సొంత బ్యానర్‌ పెట్టి సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేస్తున్నారు. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరో. ఇమాన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది. అలాగే రాఘవ లారెన్స్‌తో మా బ్యానర్‌లో రెండు సినిమాలు చేస్తున్నాం. అవి ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.'' అన్నారు. 

నిర్మాతలు జి.నాగేశ్వరరెడ్డి ఎస్‌.నరసింహ ప్రసాద్‌ మాట్లాడుతూ ''విశాల్ మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని అనువదిస్తున్నాం. తెలుగులో టైటిల్‌, లోగో పెట్టకముందే సినిమా డెబ్భై నుండి ఎనభై శాతం షూటింగ్‌ పూర్తయింది. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

కాజల్ మాట్లాడుతూ "జయసూర్య నాకు స్పెషల్ మూవీ. ఈ చిత్రానికి పని చేసిన అందరికి నా అభినందనలు. ఈ సినిమాతో నాకు మంచి ఎక్స్ పీరియన్స్ కలిగింది. షూటింగ్ లో ఉన్న ప్రతి రోజు చాలా ఎంజాయ్ చేసాను" అని చెప్పారు.

నాని మాట్లాడుతూ ''నేను నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాను తమిళంలో డైరెక్ట్ చేసిన దర్శకుడు  సుసీంద్రన్‌. నా పేరు శివ చూడగానే ఈ సినిమా నేను చేసుంటే బావుండేదే అనుకున్నాను. ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని తెలుస్తుంది. విశాల్‌ నాకు మంచి ఫ్రెండ్‌. తనకు దర్శక, నిర్మాతలకు సినిమా విజయం సాధించి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

కార్తీ మాట్లాడుతూ ''సుసీంద్రన్‌ దర్శకత్వంలో నాపేరు శివ సినిమా చేశాను. విశాల్‌, కాజల్‌ నాకు మంచి స్నేహితులు. వీరందరూ కలిసి చేస్తోన్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ట్రైలర్‌ చాలా ప్రామిసింగ్‌ గా ఉంది. ఇమాన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. త్వరలోనే స్ట్రయిట్‌గా తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నాను'' అని అన్నారు. 

గోపిచంద్‌ మాట్లాడుతూ ''సుసీంద్రన్‌ మంచి డైరెక్టర్‌. విశాల్‌ నాకు ఇష్టమైన హీరో. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మంచి చిత్రాలను తీయాలనే ఉద్దేశ్యంతో ఉండే నటుడు. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలవుతోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

ఆర్య మాట్లాడుతూ ''టోటల్ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో జి.కె.రెడ్డి, జానకమ్మ, వంశీ పైడిపల్లి, ఖుష్బూ, మధుశాలిని, భవ్య ఆనంద్‌ప్రసాద్‌,  బి.వి.ఎస్.రవి, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్‌, శశాంక్‌ వెన్నెలకంటి, సూరి, బి.ఏ.రాజు తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: వేల్ రాజ్, సంగీతం: డి.ఇమ్మాన్, ఎడిటర్: ఆంటోనీ, నిర్మాతలు: జి.నాగేశ్వరరెడ్డి, ఎస్.నరసింహ ప్రసాద్, దర్శకత్వం: సుశీంద్రన్. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement