Advertisement

మొత్తానికి సినిమా చూపించారు!


రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'సినిమా చూపిస్త మావ'. ఆగస్ట్ 14న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్ లోని తమ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా..

Advertisement

రాజ్ తరుణ్ మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని మేము అనుకున్నదానికంటే పెద్ద హిట్ చేసారు. డైరెక్టర్ గారికి కథపై చాలా క్లారిటీ ఉంది. ప్రసన్న మంచి డైలాగ్స్ ఇచ్చాడు. శేఖర్ చంద్ర తన కెరీర్ లో బెస్ట్ మ్యూజిక్ ఈ సినిమాకే ఇచ్చారు. తను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. హీరో రవితేజ గారు సినిమా చూసారని నాకు తెలుసు. కిక్‌-2కి సంబంధించిన ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆయన మంచిగా మాట్లాడటం, నా గురించి కాంప్లిమెంట్‌ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే రవితేజగారు నాకు ఇన్‌స్పిరేషన్‌. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. ఆయన రేంజ్‌ ఎనర్జీ నాకు లేదు. ఈ సినిమాలో నేను ఫ్రీ స్టయిల్‌లో నటించినప్పటికీ, ఓ రకంగా ఆయన్నుండి ఇన్‌స్ఫైర్‌ అయ్యానని చెప్పవచ్చు" అని చెప్పారు.

రావు రమేష్ మాట్లాడుతూ "ఈ సినిమాలో సోమనాథ్ చటర్జీ అనే బెంగాళీకు చెందిన వ్యక్తి పాత్రలో నటించాను. టీమ్ అంతా ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. సాయి శ్రీరాం గారి ఫోటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుంది. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి పాట అధ్బుతంగా వచ్చింది. రాజ్ తరుణ్ మాస్ ఇమేజ్ క్యారెక్టర్ లో సూపర్బ్ గా నటించాడు. ఇది నాకు స్పెషల్ ఫిలిం. నటునిగా నన్ను సాటిస్ఫై చేసిన చిత్రమిది. ప్రసన్న డైలాగ్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. తనకి మంచి భవిష్యత్తు ఉంది. రెండు పెద్ద హిట్ చిత్రాల తరువాత వచ్చినా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడం ఆనందంగా ఉంది" అని చెప్పారు.

దర్శకుడు త్రినదరావు నక్కిన మాట్లాడుతూ "ఈ సినిమా చూసిన వాళ్ళంతా బావుందని చెబుతున్నారు. సుమారుగా ఉత్తరాంధ్రలో 28 థియేటర్లకు వెళ్లాను. ప్రతి థియేటర్ లో చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసి రాఘవేంద్రరావు గారు మంచి సినిమా చేసావని మెసేజ్ చేసారు. ప్రొడ్యూసర్స్ లో తపన ఉంటే ఏ చిత్రమైన ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, అంజిరెడ్డి, ప్రసన్న కుమార్, తోటపల్లి మధు, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement