విజయ్, శ్రీదేవి, శ్రుతిహాసన్, హన్సిక ప్రధాన పాత్రల్లో చింబు దేవన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం 'పులి'. ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్. మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపై శోభారాణి తెలుగులో విడుదల చేయడానికి హక్కులను పొందారు. అయితే హైదరాబాద్ లో ఆగస్ట్ 21 శుక్రవారం నాడు జరుగుతున్న 'సంతోషం ఫిలిం అవార్డ్స్'లో పులి సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..
శోభారాణి మాట్లాడుతూ "‘మా ఎస్.వి.ఆర్. మీడియా బేనర్‌లో ఎన్నో విభిన్నమైన సినిమాలు అందించడం జరిగింది. తమిళంలో 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'పులి' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇదొక మైథలాజికల్ మూవీ. మన తెలుగు కమెడియన్స్ కూడా ఈ సినిమాలో నటించారు. చాలా లాంగ్ గ్యాప్ తరువాత శ్రీదేవి గారు సౌత్ ఇండియా లో నటిస్తున్న చిత్రమిది. మహారాణి పాత్రలో ఆమె అధ్బుతంగా నటించారు. టెక్నికల్ గా హై వాల్యూడ్ సినిమా ఇది. 2600 సి.జి. షాట్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఇప్పటివరకు విజయ్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడు చేసిన 'పులి' ఒక ఎత్తు. ఈ చిత్రంలో స్పెషల్ ఎట్రాక్షన్ దేవిశ్రీప్రసాద్ అనే చెప్పాలి. మంచి సాంగ్స్ తో పాటు అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ ను 'సంతోషం ఫిలిం అవార్డ్స్' కార్యక్రమంలో లాంచ్ చేస్తున్నాం. తమిళంలో, తెలుగులో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పారు.