Advertisement
Google Ads BL

మిస్టర్ అఖిల్ అంట, ఇదేమి టైటిల్ నాయనో!


అక్కినేని అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమాకు ఒక్క మంచి టైటిల్ కూడా దొరక్క దర్శకుడు వినాయక్, నిర్మాత నితిన్ నానా తంటాలు పడుతున్నారు. షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో అక్టోబర్ నెలలో ఎలాగైనా విడుదల ప్లాన్ చేస్తున్నారు. ముందరేమో తాండవం అనీ, మిస్సైల్ అనీ పేర్లు ఈ సినిమాకు పెట్టేసుకున్నా ఏదీ ఫైనల్ కాలేదు. ఇప్పుడేమో కొత్తగా మిస్టర్ అఖిల్ అన్న పేరును అనుకుంటున్నట్టు తెలుస్తోంది. గమనిస్తే, అఖిల్ అన్న పేరును  జనాల్లోకి స్ట్రాంగుగా తీసుకెళ్ళే ప్రయత్నంగా కనిపిస్తోంది ఈ ఫీటు.            

Advertisement
CJ Advs

మునపటి క్లాస్ అక్కినేని హీరోల్లా కాకుండా అఖిల్ అంటే ఓ మాస్ కథా నాయకుడిగా నిలిపేందుకు అన్ని మసాలాలు నూరి, యాక్షన్ రొమాంటిక్ ఫిలింగా ఈ స్క్రిప్టుని వినాయక్ చేతిలో పెట్టారు. అందుకే అఖిల్ వీర లెవెల్లో రెచ్చిపోయి నటించాడని తెలిసే మిస్టర్ అఖిల్ అని నామకరణం చేసేందుకు సిద్ధం అయ్యారేమో. ఎలా ఉందంటారు ఈ నామం?!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs