మహేష్ బాబు శ్రీమంతుడు, ప్రభాస్ రాజమౌళిల బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా వాణిజ్యం ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి వంద కోట్ల క్లబ్బులో కూడా చేరిపోయింది. ఎన్నడు చూరని దూర తీరాలను కూడా తాకుతున్న తెలుగు సినిమా గురించి మహేష్ చక్కగా చెప్పాడు. బాహుబలి చూపిన త్రోవలో నడవడం వల్ల ఇప్పటి నుండి రాబోయే ప్రతి తెలుగు మూవీ ఇంతకు ముందు కలెక్ట్ చేసిన దాని కంటే ముప్పై శాతం ఎక్కువ వసూళ్లు రాబడుతుంది.
ఇక ఈ సూత్రం గనక అన్ని స్టార్ హీరోల సినిమాలకు వర్తింపజేస్తే శ్రీమంతుడు, బాహుబలి రికార్డులు ఎంతో కాలం నిలవజాలవు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోల స్టామినా మనకు తెలియనిది కాదు. వీళ్ళ సినిమాలకు హిట్టు టాక్ వచ్చిందంటే పాత రికార్డులకు పాతరే. సో, టాలివుడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం బాహుబలి కొన్నాళ్ళు గట్టిగానే నిలబడినా శ్రీమంతుడు మాత్రం మహేష్ బ్రహ్మోత్సవం, పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల తాకిడికి కొట్టుకుపోవాల్సిందే అంటున్నారు.