మోహన్-మైనా జంటగా బైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బి.మోహన్ నిర్మిస్తున్న చిత్రం "ఒక్కడితో మొదలైంది". ఈ చిత్రానికి మొగిలి నాగేశ్వరరావు దర్శకుడు. బోలే శావలి సంగీతసారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక సోమవారం, హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రతాని రామకృష్ణ గౌడ్, బి.మోహన్ బీడ్ సీడీను, ఆడియో సీడీలను సంయుక్తంగా ఆవిష్కరించి తొలి కాపీను సంపూర్ణేష్ బాబు కు అందించారు. ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, బండారు శ్రీధర్, సాయి వెంకట్, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "ఈ మధ్యకాలంలో విడుదలయిన 'బాహుబలి' , 'శ్రీమంతుడు' చిత్రాలు కేవలం తెలుగుకే పరిమితం కాకుండా అన్ని బాషలలో విడుదలయ్యి మంచి సక్సెస్ ను సాధించి తెలుగు సినిమా స్టామినా ఎంతో చూపించాయి. చిన్న చిత్రాలు కూడా వస్తున్నాయి. కొత్త సినిమాలు, కొత్త కథానాయకులు ఇండస్ట్రీకు రావాలి. ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలి. టీమ్ అందరికి నా ఆల్ ది బెస్ట్"
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ "తెలుగు చిత్ర పరిశ్రమపై మక్కువతో బెంగుళూరు నుండి ఇక్కడకు వచ్చి- సినిమా నిర్మించడమే కాకుండా- ఈ సినిమాలో హీరోగా నటించడం అనేది అభినందించాల్సిన విషయం. ఒక మంచి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మంచి విజయం సాధించి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకొంటున్నాను" అన్నారు.
మోహన్ మాట్లాడుతూ మాట్లాడుతూ "తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. నేను కన్నడ కు చెందినా తెలుగు సినిమాతోనే తెరంగేట్రం చేయాలని భావించాను. సినిమాపై ప్యాషన్ తో ఈ చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసిన ధనరాజ్ గారు మాకు అన్ని విధాల సహకరించడంతోపాటు మాకు తెలియని ఎన్నో విషయాలను చెప్పేవారు. బోలే అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది" అని చెప్పారు.
దర్శకుడు మొగిలి నాగేశ్వరరావు మాట్లాడుతూ "ముగ్గురు యువకులు తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని ఏ విధంగా చేరుకున్నారు? అంతే కాకుండా ఒక నిస్సాయకుడైన అన్నకళ్ళముందు తన చెల్లికి దారుణం జరిగితే అతను వాళ్ళపై ఏ విధంగా కక్ష తీర్చుకున్నాడు అనే అంశంపై కథ నడుస్తుంది. కామెడీ, యాక్షన్, సస్పెన్స్ తో సాగే థ్రిల్లర్ తో అనుక్షణం ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తూ ఉత్కంట కలిగిస్తూ ఉంటుంది. చివరకు ఒక మంచి మెసేజ్ తో సినిమా ముగుస్తుంది" అని చెప్పారు.
సుమన్, లావణ్య, అనూషా, చెమ్మక్ చంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యాంప్రసాద్ దూపటి, కథ: నవీన్ రాజ్ సి.హెచ్, సంగీతం: బోలే శావలి, నిర్మాత: బి.మోహన్, దర్శకత్వం: మొగిలి నాగేశ్వరరావు.